House Rental: దేశంలో టాప్‌ ఏడు నగరాల్లో పెరిగిన అద్దె ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..

దేశంలో టాప్‌ ఏడు నగరాల్లో అద్దె ధరలు మరింతగా పెరిగాయి. ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం.. COVID-19 కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి దేశంలోని టాప్ ఏడు నగరాల్లో అద్దె విపరీతంగా పెరిగింది. దేశంలో అద్దె ధరలు పెరిగి మొదటి స్థానంలో బెంగళూరు ఉంది. ఇక్కడ అద్దె..

House Rental: దేశంలో టాప్‌ ఏడు నగరాల్లో పెరిగిన అద్దె ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..
House Rental

Updated on: Apr 21, 2023 | 3:39 PM

దేశంలో టాప్‌ ఏడు నగరాల్లో అద్దె ధరలు మరింతగా పెరిగాయి. ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం.. COVID-19 కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి దేశంలోని టాప్ ఏడు నగరాల్లో అద్దె విపరీతంగా పెరిగింది. దేశంలో అద్దె ధరలు పెరిగి మొదటి స్థానంలో బెంగళూరు ఉంది. ఇక్కడ అద్దె సంవత్సరానికి అత్యధికంగా 20 శాతం వరకు పెరిగింది. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ దేశంలోనే అత్యధికంగా 4.1% అద్దె లాభాలను కలిగి ఉంది. ముంబైలో అత్యధిక అద్దె రాబడి 3.9%తో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో, గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్, నోయిడా సెక్టార్-150, ఢిల్లీలోని ద్వారకలో అద్దె ఎక్కువగా పెరిగింది.

మెట్రో సిటీలలోనే కాకుండా పట్టణాలలో కూడా పెరిగిపోతున్నాయి. ఒక వైపు జనాభా పెరుగుతుంటే పట్టణాల్లో నివసించే వారి సంఖ్యా ప్రస్తుతం 37.4 % ఉంది. సంవత్సరానికి 20% పెరుగుతూ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ తరువాత వరుసలో ఉన్నాయి. అయితే మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో అద్దెలు తక్కువ ఉన్నటు అనారోక్ నివేదిక చెపుతుంది. పెరిగిన వడ్డీ రేట్లతో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతుండడంతో అద్దెలు గిట్టుబాటు కావడం లేదని ఇంటి ఓనర్లు చెబుతున్నారు.

గత త్రైమాసికంతో పోలిస్తే జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని టాప్ 13 మార్కెట్‌లలో సగటు ఇంటి అద్దె 4.1 శాతం పెరిగింది. అయితే థానే, అహ్మదాబాద్‌లలో మాత్రమే స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని నెలల వ్యవధిలో డిమాండ్ సరఫరా మధ్య అంతరం ఎక్కువగా ఉండటంతో అద్దెలు క్రమంగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

ఛార్జీలు నిరంతరం పెరగడానికి ప్రధాన కారణం అధిక డిమాండ్, తక్కువ సరఫరా. 13 నగరాల్లో 12 నగరాల్లో అద్దె గృహాల డిమాండ్ జనవరి-మార్చి త్రైమాసికంలో సరఫరా కంటే ఎక్కువగా ఉంది. అద్దె ఇళ్లకు డిమాండ్ తగ్గినప్పటికీ అద్దెలు 5.1 శాతం పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ తెలిపారు. భారతీయ రెంటల్ హౌసింగ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

గురుగ్రామ్‌లో అత్యధికంగా 8.3 శాతం ఇళ్ల అద్దెలు పెరిగాయి. ఆ తర్వాత నోయిడా 5.1 శాతం, హైదరాబాద్ 4.9 శాతం, ముంబై 4.2 శాతం, బెంగళూరు 3.9 శాతం, పూణె 2.9 శాతం, గ్రేటర్ నోయిడా 2.7 శాతం, కోల్‌కతా 2 శాతం, నవీ ముంబై 1.4 శాతం, చెన్నై 1.3 శాతం, ఢిల్లీ 0.7 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. అహ్మదాబాద్ 0.8 శాతం, థానె 0.5 శాతం క్షీణించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి