Income Tax Return Alert: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.67,401 కోట్ల రిఫండ్‌ చెల్లింపు: ఐటీ శాఖ

| Edited By: Ravi Kiran

Sep 06, 2021 | 6:31 AM

Income Tax Return Alert: కేంద్ర సర్కార్‌ పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌ అందించింది. వారి ఖాతాల్లో డబ్బులు జమచేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)..

Income Tax Return Alert: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.67,401 కోట్ల రిఫండ్‌ చెల్లింపు: ఐటీ శాఖ
Follow us on

Income Tax Return Alert: కేంద్ర సర్కార్‌ పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌ అందించింది. వారి ఖాతాల్లో డబ్బులు జమచేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తాజాగా విషయాన్ని వెల్లడించింది. పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లో రిఫండ్ డబ్బులు జమ చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 ఆగస్ట్ 30 వరకు 23.99 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.67,401 కోట్ల రిఫండ్ చేశామని సీబీడీటీ తెలిపింది. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్స్ మొత్తం రూ.51,029 కోట్లు. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్ మొత్తం రూ.16,373 కోట్లు.

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త ఇఫైలింగ్ పోర్టల్ వల్ల పన్ను చెల్లింపుదారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పేయర్లకు రిఫండ్ డబ్బులు చెల్లించింది. పోర్టల్ సమస్య వల్ల ఇంకా కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేదు.

సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేసిన పది రోజుల్లోనే రిఫండ్ డబ్బులు వచ్చేస్తాయి. అయితే కొన్ని సమస్యల వరకు రిఫండ్ ఆలస్యం కూడా కావచ్చు. మీకు ఇంకా రిఫండ్ డబ్బులు రాకపోతే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లోకి వెళ్లి స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి.

 

ఇవీ కూడా చదవండి:

RBI Penalty: మరో రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా.. కస్టమర్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా..?

Insurance Policy: మీకు మద్యం తాగే అలవాటు ఉండి బీమా పాలసీ తీసుకుంటున్నారా..? ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి

Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?