Income Tax Raid: లోదుస్తుల తయారీ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ దాడులు.. రూ.200 కోట్ల పన్ను ఎగవేత

పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ లక్స్ ఇండస్ట్రీస్ లొకే షన్లపై దాడులు చేస్తోన్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. కోల్‌కతా తో సహా అనేక నగరాల్లో కంపెనీకి సంబంధించిన ఇతర క్యాంపస్‌ల లో కూడా ఆదాయపు పన్ను శాఖ విభాగం సోదాలు నిర్వహిస్తోంది. కంపెనీలోని ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి...

Income Tax Raid: లోదుస్తుల తయారీ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ దాడులు.. రూ.200 కోట్ల పన్ను ఎగవేత
Income Tax Raid

Edited By:

Updated on: Sep 23, 2023 | 5:00 AM

దేశంలోని లోదుస్తుల తయారీ కంపెనీ లక్స్ ఇండస్ట్రీస్‌ పై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. 200 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఈ వార్తల తర్వాత కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. బిఎస్‌ఇ డేటా ప్రకారం.. లక్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 4 శాతం క్షీణతను చూస్తున్నాయి. ఇప్పటి వరకు కంపెనీ, ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

200 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ లక్స్ ఇండస్ట్రీస్ లొకే షన్లపై దాడులు చేస్తోన్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. కోల్‌కతా తో సహా అనేక నగరాల్లో కంపెనీకి సంబంధించిన ఇతర క్యాంపస్‌ల లో కూడా ఆదాయపు పన్ను శాఖ విభాగం సోదాలు నిర్వహిస్తోంది. కంపెనీలోని ఉన్నతాధికారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి.

కంపెనీ షేర్లు 4.55 శాతం క్షీణించాయి:

తర్వాత కంపెనీ షేర్లలో 4.55 శాతం క్షీణత కనిపించింది. కంపెనీ షేర్లు రోజు కనిష్ట స్థాయి రూ.1451కి చేరాయి. బీఎస్‌ఈ డేటా ప్రకారం.. కంపెనీ షేర్లు 3.32 శాతం అంటే 50.50 శాతం క్షీణతతో రూ.1469.70 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే ఈరోజు కంపెనీ షేర్లు రూ.1510 వద్ద ప్రారంభమయ్యాయి. ఒక రోజు క్రితం కంపెనీ షేర్లు రూ.1520.20 వద్ద ముగిశాయి.

ఇవి కూడా చదవండి

ఈ కంపెనీ కార్యాలయంలో కూడా ఐటీ దాడులు:

కాన్పూర్‌లోని ప్రముఖ షూ తయారీ కంపెనీ యూరో ఫుట్‌వేర్ కార్యాలయం పై కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. యూరో ఫుట్‌వేర్ అనేది షూలను ఎగుమతి చేసే పెద్ద షూ తయారీ సంస్థ. దీనికి దేశంలో ని అనేక చోట్ల కార్యాలయాలు, కర్మాగారాలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సివిల్ లైన్స్‌లోని కృష్ణా టవర్ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ బృందం ఆకస్మికంగా దాడి చేసింది. ఆదాయపు పన్ను శాఖ బృందం 3 వాహనాల్లో వచ్చి మెట్ల మీదుగా నాలుగో అంతస్తులో ఉన్న కంపెనీ కార్యాలయం పై దాడి చేసింది. ఈ సమయంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఆదాయపు పన్ను శాఖ బృందం కంపెనీలోని ఇతర ప్రదేశాలపై కూడా దాడులు నిర్వహించింది. ఇలా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు పన్నుల విషయంలో ప్రత్యేక నిఘా పెడుతోంది. పన్ను ఎగ్గొట్టే వారిపై నోటీసులు పంపిస్తున్నాయి. ఇక ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారాలలో పన్ను ఎగ్గొడితే ఆ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి