AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penalty: మిత్రమా గడువు సమీపిస్తోంది.. ఈ పని నెలాఖరులోగా చేయకపోతే రూ.5,000 జరిమానా!

మీరు ఇంకా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు జూలై 31, ఈ పని చేయడానికి మీకు 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే, వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే ఈసారి గడువును పొడిగించే ఆలోచనలో ఆదాయపు పన్ను శాఖ లేదు. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారు..

Penalty: మిత్రమా గడువు సమీపిస్తోంది.. ఈ పని నెలాఖరులోగా చేయకపోతే రూ.5,000 జరిమానా!
Itr
Subhash Goud
| Edited By: |

Updated on: Jul 22, 2024 | 10:27 PM

Share

మీరు ఇంకా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు జూలై 31, ఈ పని చేయడానికి మీకు 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఇంకా ఐటీఆర్‌ ఫైల్ చేయకపోతే, వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే ఈసారి గడువును పొడిగించే ఆలోచనలో ఆదాయపు పన్ను శాఖ లేదు. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేవారు పెనాల్టీగా భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత మీరు ఎంత జరిమానా చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోండి.

3 కోట్లకు పైగా రిటర్న్ ఫైళ్లు:

ఆదాయపు పన్ను ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న డ్యాష్‌బోర్డ్‌లో ఇప్పటివరకు 12 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు పోర్టల్‌లో తమను తాము నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల 10 లక్షల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. వాటిలో 2 కోట్ల 90 లక్షలకు పైగా రిటర్నులను పన్ను చెల్లింపుదారులు ధృవీకరించారు. వాటిలో 94.53 లక్షల రిటర్నులను కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రాసెస్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Pressure Cooker: వంట చేసేటప్పుడు కుక్కర్‌ విజిల్‌ నుంచి నీరు లీక్‌ అవుతుందా? ఇలా చేయండి

దాఖలు చేయనందుకు జరిమానా ఏమిటి?

ప్రస్తుత ఆదాయపు పన్ను రిటర్న్ నిబంధనల ప్రకారం, ఈ సీజన్‌లో డిసెంబర్ 31 వరకు రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం 31 జూలై 2024 వరకు ఉచితం. గడువు ముగిసిన తర్వాత ఆలస్యమైన రిటర్న్‌ను దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారుకు డిసెంబర్ 31 వరకు సమయం ఉంది. అయితే దాని కోసం పన్ను చెల్లింపుదారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

పెనాల్టీ మొత్తం పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆలస్యమైన రిటర్న్ ఫైల్‌పై అతను రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అతను రూ. 5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా పన్ను చెల్లింపుదారు తన పన్ను మొత్తంపై వడ్డీని కూడా చెల్లించాలి.

గడువు ఎందుకు పొడిగించాలి?

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు జూలై 31. గడువు సమీపిస్తుండటంతో రిటర్నుల దాఖలులో వేగం పెరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ ఫైలింగ్ పోర్టల్‌లో రద్దీ పెరగడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియాలో నిరంతరం రాస్తూనే ఉన్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు పోర్టల్ స్లోగా ఉండటం, మధ్యలో చిక్కుకుపోవడం వల్ల గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కాకుండా, పాస్‌వర్డ్ రీసెట్, ఓటీపీ, వెరిఫికేషన్‌లో కూడా పన్ను చెల్లింపుదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు మిస్ అయితే అదే టికెట్‌పై వేరే ట్రైన్‌ ఎక్కవచ్చా..? నిబంధనలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి