Income Tax: ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ పొరపాటు చేస్తే రూ.10 వేల జరిమానా తప్పదు..!
ఆదాయపు పన్ను విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేస్తే మంచిది లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ విషయంలో వినియోగదారులు చేసే పొరపాట్లు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అలాంటి వారికి ఆలస్య రుసుముతో పాటు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే దేశంలో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు […]
ఆదాయపు పన్ను విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేస్తే మంచిది లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ విషయంలో వినియోగదారులు చేసే పొరపాట్లు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అలాంటి వారికి ఆలస్య రుసుముతో పాటు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే దేశంలో ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువు తేదీ కూడా ఉంది. ప్రజలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయాన్ని 31 జూలై 2023లోపు వెల్లడించాలి. దేశంలోని కోట్లాది మంది ప్రజలు 31 జూలై 2023 నాటికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. అయితే, ఈ గడువు తేదీ వరకు ఐటీఆర్ దాఖలు చేయని వారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వారికి జరిమానా కూడా విధించవచ్చు.
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రజల ఆదాయం సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, వారు ఆలస్య రుసుము రూపంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తులు 31 జూలై 2023 తర్వాత కానీ డిసెంబర్ 31, 2023లోపు ఆలస్య రుసుముతో ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేస్తే, వారు రూ. 5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలి.
పెనాల్టీ మొత్తం:
రూ. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఆదాయం ఉన్న వ్యక్తులకు ఆలస్యంగా దాఖలు చేస్తే రూ. 5000 జరిమానా విధించబడుతుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా రూ. 1000. మరోవైపు, డిసెంబర్ 31, 2023 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే పెనాల్టీ మొత్తం కూడా పెరగవచ్చు.
రూ. 10,000 జరిమానా
ఒక వ్యక్తి డిసెంబర్ 31, 2023 తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే, అప్పుడు అతను రూ. 10,000 జరిమానా చెల్లించాలి. గడువు తేదీలోపు రిటర్న్‌ను ఫైల్ చేయడంలో విఫలమైతే, పన్ను బకాయి ఉంటే రిటర్న్ దాఖలు చేసే వరకు నెలకు 1% అదనపు వడ్డీ ఉంటుంది. అదే సమయంలో 2024 మార్చి 31 వరకు అప్‌డేట్ చేసిన రిటర్న్‌కు 25% అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 31 డిసెంబర్ 2024 వరకు 50% అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ విషయంలో కేంద్రం విధించే నిబంధనలు తప్పకుండా పాటించాలి. లేకపోతే ఆర్థిక నష్టంతో పాటు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి