ఆధార్ కార్డు.. ఇప్పుడు భారత పౌరుడిగా గుర్తించాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన కార్డ్. చదువులు, ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంక్ అకౌంట్స్ వరకు అన్నింటికి ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. ఇటీవల వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకోవాలని ఆయా బ్యాంక్స్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ తేదిలోగా లింక్ చేసుకోవాలంటూ యూజర్లకు పదే పదే గుర్తుచేసాయి. అయితే ఆధార్, అకౌంట్ లింక్ చేయడం వలన తమ నగదు సేఫ్గా ఉంటుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. తమ ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత సమాచారంతోపాటు. ఆర్థిక విషయాలను కూడా షేర్ చేసుకోవద్దు. అయితే చాలా చోట్ల ఆధార్ నంబర్ వినియోగిస్తుంటాం. అటు ఈ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాల్సిందే. ఆధార్ నెంబర్ ఎవరికైనా తెలిస్తే.. ప్రమాదం ఉంటుందా ? అని చాలా మందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నెట్టింట్లో ఈ విషయంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై యూఐడీఏఐ స్పష్టత ఇచ్చింది. ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయడం వీలుకాదని తెలిపింది. కేవలం ఒక్క ఆధార్ నెంబర్ ద్వారా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పేర్కొంది. అలాగే.. ఓటీపీ, పిన్ నెంబర్, పాస్ వర్డ్ వంటివి ఎవరికి తెలియకుండా చూసుకోవాలని యూఐడీఏఐ తెలిపింది. ఎవరికైనా తెలిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read: Revanth Reddy: పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
తెలంగాణలో ఎలక్షన్ టాక్ సైడ్ అయిందా?దళిత బంద్ పధకం కాదు ఒక ఉద్యమం..:Big News Big Debate Live Video.