PAN CARD : మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నాయా..! అయితే వెంటనే జాగ్రత్త పడండి..

| Edited By: Anil kumar poka

Jul 08, 2021 | 8:24 AM

PAN CARD : పాన్ కార్డ్‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పది అంకెల ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌ను కేటాయిస్తుంది.

PAN CARD : మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నాయా..! అయితే వెంటనే జాగ్రత్త పడండి..
Pan Card 1
Follow us on

PAN CARD : పాన్ కార్డ్‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పది అంకెల ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌ను కేటాయిస్తుంది. పాన్ హోల్డర్ చేసే అన్ని లావాదేవీలను గుర్తించడానికి పాన్‌కార్డు ఉపయోగపడుతుంది. ఈ లావాదేవీలలో పన్ను చెల్లింపులు, టిడిఎస్ / టిసిఎస్ క్రెడిట్స్, ఆదాయ రాబడి, కరస్పాండెన్స్ మొదలైనవి ఉంటాయి. ఇప్పటికే పాన్ కార్డ్ కలిగి ఉన్నవారు మరో పాన్‌కార్డును పొందలేరు. ఒకటి కంటే ఎక్కువ పాన్లను ఆదాయపు పన్ను శాఖ అనుమతించదు.

ఒకవేళ ఎవరైనా అలాచేస్తే ఆ వ్యక్తికి జరిమానా విధిస్తారు. ఆదాయపు పన్ను శాఖ అందించిన సమాచారం ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు కలిగి ఉంటే ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 272 బి కింద రూ .10,000 జరిమానా విధిస్తారు. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు కేటాయించినట్లయితే వెంటనే అతడు మిగిలిన పాన్ కార్డు‌లను ఆదాయపు పన్ను శాఖ అప్పగించాలి. పాన్ కార్డ్ లేకుంటే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. బ్యాంక్ నుంచి బ్యాంకు వరకు ఏదైనా పెట్టుబడి పథకంలో పాన్ కార్డు కచ్చితంగా అవసరం. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వీలైనంత త్వరగా దానిని ఆధార్ నంబర్‌తో లింక్ చేయడం.

పాన్ కార్డును ఆధార్‌తో ఆన్‌లైన్‌లో లింక్ చేసే ప్రక్రియ..
1. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ను తెరవండి.
2. ఇక్కడ మీరు ఆధార్ లింక్ ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.
3. అప్పుడు దిగువ పెట్టెలో మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పేరు ఎంటర్ చేయండి.
4. కాప్చా కోడ్‌ను జాగ్రత్తగా తనిఖీ చేసి, బాక్స్ నింపండి.
5. అన్ని పెట్టెలను నింపిన తరువాత ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి.

PM Modi Cabinet: మోడీ కేబినెట్ విస్తరణ.. 15 మంది కేబినెట్ మంత్రులు, 28 మంది సహాయ మంత్రులు

ICC Rankings: టీ20ల్లో కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పదిలం.. టాప్ టెన్ లో రోహిత్‌కు దక్కని చోటు!

కర్ణాటకలో 100 బెడ్స్ తో పీడియాట్రిక్ ఐసీయూ …..ప్రారంభించిన డిప్యూటీ సీఎం అశ్వత్థనారాయణ్…