AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Currency: నకిలీ కరెన్సీ ఉంటే ఇలా చేయాల్సిందే.. లేకుంటే ఏడేళ్ల జైలు తప్పదంతే..!

ధనం మూలం ఇదం జగత్.. అంటే ఈ సమాజం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. అందువల్ల మనుషులు చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఇలాంటి డబ్బును సులువుగా సంపాదించడానికి కేటుగాళ్లు కొత్త పంథాను ఎంచుకుంటూ ఉంటారు. మనం వినియోగించే సొమ్మునే నకిలీ నోట్లను తయారు చేసి చలామణి చేస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా మన వద్ద ఉన్న సొమ్ములో ఆ నకిలీ నోటు ఉంటే ఏం చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

Fake Currency: నకిలీ కరెన్సీ ఉంటే ఇలా చేయాల్సిందే.. లేకుంటే ఏడేళ్ల జైలు తప్పదంతే..!
Fake Currency
Nikhil
|

Updated on: Feb 14, 2025 | 4:06 PM

Share

ఇటీవల ఢిల్లీ కోర్టు నకిలీ 2000 రూపాయల నోట్లను కలిగి ఉండడంతో పాటు ఉపయోగించిన ఇద్దరి వ్యక్తులకు శిక్ష ఖరారు చేసింది. ఐపీసీ సెక్షన్ 489 బి (నిజమైన, నకిలీ లేదా నకిలీ కరెన్సీ నోట్లు లేదా బ్యాంకు నోట్లను ఉపయోగించడం), సెక్షన్ 489 సి (నకిలీ లేదా నకిలీ నోట్లను కలిగి ఉండటం) కింద కోర్టు చర్యలు తీసుకుంది. వీరిద్దరి నుంచి పోలీసులు 2000 రూపాయల 29 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోటును ముద్రించడం ఎంత నేరమో? అవి మన ఉన్నాయని తెలిసి వాటిని సైలెంట్‌గా చలామణి చేయడం కూడా అంతే నేరమని భారతీయ చట్టాల ద్వారా తెలుస్తుంది. భారతదేశంలో నకిలీ కరెన్సీని ఉపయోగించడం, తయారు చేయడం, చలామణి చేయడం లేదా కలిగి ఉండటం వంటి వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.

నకిలీ నోటు తయరు చేసినా, చలామణి చేసినా భారత శిక్షాస్మృతి (ఐపీసీ) ప్రకారం పలు శిక్షలను విధించడంతో పాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఐపీసీలోని సెక్షన్ 489 ఏ ప్రకారం నకిలీ నోట్లను తయారు చేస్తే జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 489 బీ ప్రకారం నకిలీ నోట్లను ఉపయోగించడం లేదా చలామణి చేయడానికి ప్రయత్నించినా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. సెక్షన్ 489 సీపీ నకిలీ నోట్లు అని తెలిసి ఎవరైనా వ్యక్తి వాటిని వారి దగ్గరే ఉంచుకుంటే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. 

అలాగే సెక్షన్ 489డీ ప్రకారం నకిలీ నోట్లను ముద్రించడానికి పరికరాలు లేదా ప్లేట్లను తయారు చేయడం లేదా కలిగి ఉంటే దీనికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అయితే  సెక్షన్ 489 ఈ నిజమైన కరెన్సీ నోట్లను పోలిన ప్రకటనలు, పత్రాలు లేదా సామగ్రిని ముద్రిస్తే దీనికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో నకిలీ నోట్లను ఉపయోగిస్తుంటే ఉగ్రవాద నిరోధక చట్టాల (UAPA, PMLA) కింద కూడా చర్యలు తీసుకోవచ్చు. నకిలీ కరెన్సీకి సంబంధించిన కేసులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ ) చట్టం, 1934 కింద దర్యాప్తు చేయవచ్చు

ఇవి కూడా చదవండి

నకిలీ ఉంటే ఏం చేయాలి?

అనుకోకుండా మీ దగ్గర ఉన్న సొమ్ములో నకిలీ నోట్ వస్తే వెంటనే సమీపంలోని బ్యాంకు లేదా పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. నకిలీ నోటును మరెవరికీ ఇవ్వడం లేదా ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కూడా నేరం. బ్యాంకు ఆ నకిలీ నోటును స్వాధీనం చేసుకుని పోలీసులకు, ఆర్‌బీఐకు తెలియజేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి