ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 11వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నికర ఆస్తుల విలువ ఎంతో తెల్సా.? సుమారు రూ. 10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ అనే సామెతను మీరు వినే ఉంటారు. ఒకవేళ ఈ సామెత ప్రకారం.. అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నో రోజులు పడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
ఇది చదవండి: డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. తిరిగి సీట్ దగ్గరకు వెళ్లి చూడగా
ఒకవేళ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ రోజుకు రూ. 3 కోట్ల ఖర్చు చేసినా.. లేదా విరాళంగా ఇచ్చినా.. వారి సంపద మొత్తం కరిగిపోవడానికి మొత్తం 3,40,379 రోజులు పడుతుందట. అంటే సంవత్సరానికి 365 రోజుల చొప్పున లెక్కపెడితే.. 932 సంవత్సరాల 6 నెలలకు అంబానీ ఫ్యామిలీ సంపద జీరోకు చేరుకుంటుందట. ఇక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంబానీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1.98 లక్షల కోట్లు పెరిగిందని తెలుస్తోంది. అటు అనంత్ అంబానీ పెళ్లికి సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్టు టాక్.
ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..