Fixed Deposit: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదిరిపోయే వడ్డీరేట్లు..

బ్యాంకులు వేర్వేరు కాలపరిమితుల కోసం FDల వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ వడ్డీ ప్రయోజనాన్ని అందించబోతున్నట్లు ప్రకటించాయి.

Fixed Deposit: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదిరిపోయే వడ్డీరేట్లు..
Fixed Deposits
Follow us
Venkata Chari

|

Updated on: Jul 02, 2022 | 2:03 PM

ఆర్బీఐ రెపొ రేటు పెంచడంతో పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లను పెంచాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని తరువాత, బ్యాంకులు వేర్వేరు కాలపరిమితుల కోసం FDల వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ వడ్డీ ప్రయోజనాన్ని అందించబోతున్నట్లు ప్రకటించాయి. మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చూస్తుంటే, తాజాగా మరికొన్ని బ్యాంకులు ఈ లిస్టులో చేరిపోయాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. మీరు IDFC ఫస్ట్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో FD పెట్టాలని నిర్ణయించుకుంటే ఎక్కువ వడ్డీని పొందుతారు. ఈ రెండు బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇది కాకుండా పొదుపు ఖాతా వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ కెనరా బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.

IDFC ఫస్ట్ బ్యాంక్‌లో FDపై మీకు ఎంత వడ్డీ లభిస్తుందంటే..

వ్యవధి వడ్డీ రేటు (%లో)
7 – 29 రోజులు 3.50
30-90 రోజులు 4.00
91 – 180 రోజులు 4.50
181 రోజుల నుండి 1 సంవత్సరం 5.75
1 సంవత్సరం 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు 6.25
3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు 6.50
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు 6.00

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో FDపై మీకు ఎంత వడ్డీ లభిస్తుందంటే..

ఇవి కూడా చదవండి
వ్యవధి వడ్డీ రేటు (%లో)
7-30 రోజులు 2.50
31 – 90 రోజులు 3.00
91-179 రోజులు 3.50
180 – 363 రోజులు 4.75
364 రోజులు 5.25
365 – 389 రోజులు 5.50
390 రోజుల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ 5.75
3 నుండి 10 సంవత్సరాలు 5.90

కెనరా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాపై అధిక వడ్డీ..

కెనరా బ్యాంక్ తన పొదుపు ఖాతా వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం బ్యాంకు తన కస్టమర్లకు 3.55% వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంక్ వడ్డీ రేటు జూన్ 29, 2022 నుంచి అమలులోకి వచ్చింది. కొత్త వడ్డీ రేట్లను ఇప్పుడు చూద్దాం..

50 లక్షల వరకు డిపాజిట్లపై – 2.90%

రూ. 50 లక్షల నుంచి రూ. 100 కోట్ల డిపాజిట్లపై – 2.90%

రూ. 100 నుంచి 300 కోట్ల డిపాజిట్లపై – 3.10%

రూ. 300 నుంచి 500 కోట్ల డిపాజిట్లపై – 3.10%

500 నుంచి 1000 కోట్ల డిపాజిట్లపై – 3.50%

1000 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై – 3.55%