Credit Card Limit: ఫుల్ లిమిట్ లావాదేవీని రిజెక్ట్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వినియోగదారుల కోర్టు
చాలా మంది ఉద్యోగులకు క్రెడిట్ కార్డు ఉండడం అనేది పరిపాటిగా మారింది. అయితే ఒక్కోసారి లావాదేవీల విషయంలో బ్యాంకులు తీసుకునే జాగ్రత్తలు వినియోగదారులకు కొత్త చిక్కులు తీసుకువస్తున్నాయి. ఇటీవల క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి ఢిల్లీ వినియోగదారుల కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒకే లావాదేవీలో ఫుల్ క్రెడిట్ లిమిట్ వినియోగించకుండా ఐసీఐసీఐ బ్యాంక్ లావాదేవీను తిరస్కరించింది. దీంతో వినియోగదారుడు తనకు కలిగిన అసౌకర్యంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
ఇటీవల కాలంలో పెరిగిన బ్యాంకింగ్ టెక్నాలజీ కారణంగా క్రెడిట్ కార్డుల జారీ సులభతరమైంది. ముఖ్యంగా చాలా మంది ఉద్యోగులకు క్రెడిట్ కార్డు ఉండడం అనేది పరిపాటిగా మారింది. అయితే ఒక్కోసారి లావాదేవీల విషయంలో బ్యాంకులు తీసుకునే జాగ్రత్తలు వినియోగదారులకు కొత్త చిక్కులు తీసుకువస్తున్నాయి. ఇటీవల క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి ఢిల్లీ వినియోగదారుల కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒకే లావాదేవీలో ఫుల్ క్రెడిట్ లిమిట్ వినియోగించకుండా ఐసీఐసీఐ బ్యాంక్ లావాదేవీను తిరస్కరించింది. దీంతో వినియోగదారుడు తనకు కలిగిన అసౌకర్యంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ వినియోగదారుల కోర్టు ఐసీఐసీఐ బ్యాంకు తీరును తప్పుపట్టింది. సరైన సేవలను అందించనందుకు వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఈస్ట్ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ పరిమితిని మేరకు లావాదేవీ చేసినా బ్యాంక్ తమ లావాదేవీని తిరస్కరించిందని మొత్తం క్రెడిట్ పరిమితిని ఒకే సందర్భంలో ఖర్చు చేయలేమని పేర్కొందని ఢిల్లీ వినియోగదారుల కోర్టుకు ఫిర్యాదు చేళశారు. వినియోగదారుల ఫిర్యాదును పరిశీలించిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బ్యాంకు వైఖరి సరిగ్గా లేదని పేర్కొంది. బ్యాంకు పరిమితి సరికాదని మందలిస్తూ వినియోగదారులు తమ మొత్తం క్రెడిట్ కార్డ్ పరిమితిని ఒక లావాదేవీలో ఉపయోగించుకోవడం అనుమతి ఇవ్వాలని చెప్పింది. వినియోగదారుడిని ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.12,500 పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు బ్యాంకును ఆదేశించింది. క్రెడిట్ కార్డ్ హోల్డర్‌కు కార్డు జారీ చేసినప్పుడే పరిమితిని పేర్కొంటారని, తర్వాత అత్యవసర సమయంలో దానిని ఉపయోగించుకోవడం అనేది తన ప్రాథమిక హక్కును తేల్చి చెప్పింది.
బిల్లింగ్ ఛార్జీలు, లావాదేవీలకు వడ్డీతో పాటు క్రెడిట్ కార్డ్‌కు వార్షిక రుసుమును వసూలు చేసే బ్యాంక్ విధానం పరిశ్రమ నిబంధనలకు అనుగుణంగా ఉందని ఇద్దరు సభ్యుల బెంచ్ పేర్కొంది. అయితే లావాదేవీల పరిమితితో పాటు ఒకేసారి ఫుల్ లిమిట్ వినియోగించకూడదనే నిబంధనల బ్యాంకు వినియోగదారుడికి చెప్పడంలో విఫలం అయ్యిందని వివరించింది. ముందస్తు కమ్యూనికేషన్ లేకపోవడం అనేది బ్యాంకు వైఫల్యం అని పేర్కొన్న వినియోగదారుల కోర్టు బాధితుడికి నష్ట పరిహారం అందించాలని వివరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి