Car Offers: హ్యూందాయ్ బంపర్ ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా 43,000 వరకూ డిస్కౌంట్.. పూర్తి వివరాల కోసం..

ప్రముఖ కార్ల దిగ్గజం హ్యూందాయ్ మోటార్ తన ఉత్పత్తులపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. మార్చి చివరి వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కొరియాకు చెందిన ఈ కార్ల దిగ్గజం తన కార్లపై ఏకంగా రూ. 43,000 వరకూ పలు తగ్గింపులను అందిస్తోంది. ఈ కార్ల లిస్ట్ లో హ్యూందాయ్ ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా సబ్ కాంపాక్ట్ సెడాన్, వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ వంటివి ఉన్నాయి. ఏ కార్ పై ఎంత ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Car Offers: హ్యూందాయ్ బంపర్ ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా 43,000 వరకూ డిస్కౌంట్.. పూర్తి వివరాల కోసం..
Hyundai
Follow us
Madhu

|

Updated on: Mar 09, 2024 | 7:13 PM

ప్రముఖ కార్ల దిగ్గజం హ్యూందాయ్ మోటార్ తన ఉత్పత్తులపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. మార్చి చివరి వరకూ ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కొరియాకు చెందిన ఈ కార్ల దిగ్గజం తన కార్లపై ఏకంగా రూ. 43,000 వరకూ పలు తగ్గింపులను అందిస్తోంది. ఈ కార్ల లిస్ట్ లో హ్యూందాయ్ ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా సబ్ కాంపాక్ట్ సెడాన్, వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ వంటివి ఉన్నాయి. ఏ కార్ పై ఎంత ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్..

మార్చి నెలలో ఈ కారుపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారుపై ఏకంగా రూ. 43,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. దీనిలో క్యాష్ డిస్కౌంట్ రూ. 30,000, అలాగే ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 10,000, అలాగే రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. వాస్తవానికి ఈ కారు మారుతి సుజుకీ స్విఫ్ట్ పోటీగా మార్కెట్లో ఉంది. హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ. 5.92లక్షల నుంచి రూ. 8.56లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.

హ్యూందాయ్ ఆరా..

ఈ కారుపై ఈ మార్చి నెలలో రూ. 33,000 వరకూ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ కారుపై రూ. 20,000 వరకూ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 10,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3000 వరకూ ఉంటాయి. మార్కెట్లో ఈ కారుకు పోటీగా మారుతి డిజైర్, హోండా అమేజ్ వంటివి ఉన్నాయి. కాకా ఈ హ్యూందాయ్ ఆరా ధరలు రూ. 6.49లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది సీఎన్జీ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

హ్యూందాయ్ వెన్యూ..

ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కారుపై రూ. 30,000 వరకూ డిస్కౌంట్లు పొందొచ్చు. దీనిలో రూ. 20,000 వరకూ డ్యాష్ డిస్కౌంట్లు కాగా ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 10,000 లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94లక్షల నుంచి రూ. 13.48లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటాయి. ఈ కారు మార్కెట్లో కియా సోనెట్, మారుతి బ్రెజ్జా వంటి బ్రాండ్లతో పోటీ పడుతుంది.

హ్యూందాయ్ ఐ20..

ఈ కారు మార్కెట్లో మారుతి బాలెనోతో పోటీ పడుతోంది. ఈ కారుపై ఏకంగా రూ. 25,000 డిస్కౌంట్ ను పొందొచ్చు. దీనిలో డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000 కాగా, ఎక్స్ చేంజ్ బోనస్ రూ. 10,000 వరకూ ఉంటుంది. ఈ కారును మీరు రూ. 7.04లక్షల నుంచి రూ. 11.21 లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..