Vegetable Prices: పండగవేళ ప్రజలకు శుభవార్త.. దిగొచ్చిన కూరగాయల ధరలు.. నేటి రేట్లు ఇవే!
పండగ పూట హైదరాబాదీలకు కూరగాయల ధరలు స్వల్ప ఊరటను కల్పించాయి. గత కొన్ని రోజులుగా భగ్గుమంటున్న కూరగాయల ధరలు ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. బహిరంగ మార్కెట్‌తో పోల్చుకుంటే ఈ రోజులు కూకట్‌పల్లి రైతు భజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దసరా పండగ రోజు హైదరాబాద్ ప్రజలకు కూరగాయలు ధరలు గుడ్‌న్యూస్ చెప్పాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరుగూ వస్తున్న ధరలు పండల రోజు కాస్త దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో బహిరంగ మార్కెట్లతో పోలిస్తే నిత్యావసర కూరగాయలు వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. మార్కెట్ ధరల ప్రకారం కిలో టమాట రూ.23, ఉల్లిగడ్డ రూ.40, బంగాళాదుంప రూ.18కే లభిస్తున్నాయి, మరోవైపు వెల్లుల్లి కిలో రూ.260, ఎండుమిర్చి రూ.280 వద్ద కొనసాగుతుండగా, పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120 పలుకుతున్నాయి.
కూకట్‌పల్లి మార్కెట్‌లో నేటి కూరగాయల ధరలు
మంగళవారం రైతు బజార్‌లో కూరగాయలు పరిశీలిస్తే, కిలో టమాట రూ. 23, ఉల్లిగడ్డ రూ. 40, బంగాళాదుంప రూ. 18, వంకాయ రూ. 18, బెండకాయ రూ. 23, పచ్చిమిర్చి రూ. 55, బజ్జి మిర్చి రూ. 75, బీన్స్ రూ. 50, క్యారెట్ రూ. 43, గోబీపువ్వు (క్యాలీఫ్లవర్) రూ. 25, క్యాబేజీ రూ. 13, దొండకాయ రూ. 18, కాకరకాయ రూ. 23, బీరకాయ రూ. 23, చిక్కుడుకాయ రూ. 55, గోరుచిక్కుడు రూ. 23, క్యాప్సికం రూ. 50, దోసకాయ రూ. 28, సొరకాయ రూ. 20, పొట్లకాయ రూ. 18, ఆ-కాకరకాయ రూ. 85, పల్లికాయ రూ. 50, లోభా రూ. 28 కి విక్రయిస్తున్నారు.
ఇక దుంపలు, ఆకు కూరలు ధరలు చూసుకుంటే.. బీట్‌రూట్ రూ. 28, చామగడ్డ రూ. 28, చిలగడదుంప రూ. 28, కంద రూ. 28, ఉల్లిపారక రూ. 55, కరివేపాకు రూ. 60, గుమ్మడికాయ రూ. 15, లోకల్ కీర రూ. 18, ఇటాలియన్ కీర రూ. 28, పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ. 45, బొప్పాయి రూ. 50, ఉసిరి రూ. 65, పండుమిర్చి రూ. 80, ఎండుమిర్చి రూ. 280, వెల్లుల్లి రూ. 260, పాత అల్లం రూ. 180, కొత్త అల్లం రూ. 120, చింతపండు రూ. 160 విక్రయిస్తున్నారు.
అలాగే డజన్ నిమ్మకాయలు రూ. 50 నుంచి రూ. 60 పలుకుతుండగా, మునక్కాయ ఒక్కొక్కటి రూ. 6 నుంచి రూ. 8, ముల్లంగి ఒక్కొక్కటి రూ. 6 నుంచి రూ. 8, పచ్చి అరటికాయ ఒక్కొక్కటి రూ. 9 నుంచి రూ. 10, పచ్చి మామిడికాయ ఒక్కొక్కటి రూ. 15 నుంచి రూ. 20 వరకు అమ్ముతున్నారు.
అయితే మార్కెట్లో పైన పేర్కొన్న ఈ ధరలు కేవలం మంగళవారం రోజు మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. అలాగే బయటి మార్కెట్‌లో కూడా ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి కొనే ముందు ఒక సారి తాజా ధరలను తెలుసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
