AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Calculator: ట్యాక్స్ చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారా.. ఈ కాలిక్యులేటర్‌తో ఇక చాలా ఈజీ..

పాత లేదా కొత్త పన్ను విధానంలో ఏది ప్రయోజనకరంగా ఉంటుందా అనే సందేహం అందరికీ ఉంది. ముందస్తుగా స్పష్టత ఇవ్వడానికి, పన్ను కాలిక్యులేటర్‌‌ను కొత్తగా తీసుకొచ్చింది ఆదాయపు పన్ను (IT) శాఖ. అధికారిక పోర్టల్‌లో.. ఈ తాజా సేవను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి చూడవచ్చు.

Income Tax Calculator: ట్యాక్స్ చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారా.. ఈ కాలిక్యులేటర్‌తో ఇక చాలా ఈజీ..
Tax
Sanjay Kasula
|

Updated on: Feb 27, 2023 | 2:31 PM

Share

పన్ను లెక్కింపును ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మీరు ఎంత పన్ను చెల్లించాలి..? పాత లేదా కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉందా..? ఇలాంటి ఎన్నే సందేహాలు ఎల్లప్పుడూ మనలో చాలా మందలో కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి, ఆదాయపు పన్ను (IT) శాఖ తన పోర్టల్‌లో పన్ను కాలిక్యులేటర్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. దీన్ని ఉపయోగించడం ద్వారా ఏ వ్యవస్థలో ఎంత పన్ను వర్తిస్తుంది. ఏది ప్రయోజనకరం వంటి విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించిన పన్ను రిటర్న్‌ల దాఖలు ఏప్రిల్ 1 నుంచి అనుమతించబడతాయి.

ఇప్పటికే రిటర్న్‌ల ఫారమ్‌లు తెలియజేయబడ్డాయి. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు పన్నుపై అవగాహన పెంచేందుకు ఐటీ ట్యాక్స్ క్యాలిక్యులేటర్‌ను రూపొందించారు. కొత్త, పాత సిస్టమ్‌లలో మీ వర్తించే పన్నును తెలుసుకోవడానికి, ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ లో IT పన్ను కాలిక్యులేటర్ కోసం బ్రౌజ్ చేయండి.

మీరు క్విక్ లింక్‌లలో ‘ఆదాయ పన్ను కాలిక్యులేటర్’ని చూడవచ్చు. దానిపై క్లిక్ చేస్తే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

1) బేసిక్ కాలిక్యులేటర్.

2) అధునాతన కాలిక్యులేటర్.

రెండింటినీ ఉపయోగించి, ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసుకోవచ్చు. ప్రాథమిక కాలిక్యులేటర్‌లో.. మీరు అసెస్‌మెంట్ ఇయర్, ట్యాక్స్‌పేయర్ కేటగిరీ (వ్యక్తిగత, HUF, LLP వంటివి), పన్ను చెల్లింపుదారుల వయస్సు, నివాస స్థితి మొదలైనవాటిని ఎంచుకోవాలి. మీ వార్షిక ఆదాయం, మీ మొత్తం తగ్గింపులను నమోదు చేయండి. పాత, కొత్త పన్ను విధానాలలో ఎంత పన్ను విధించబడుతుందో మీకు నేరుగా తెలుస్తుంది.

చెల్లించవలసిన పన్ను మరింత వివరణాత్మక గణన కోసం అధునాతన కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. ముందుగా మీరు పాత,కొత్త పన్ను వ్యవస్థల్లో దేనిని ఎంచుకుంటున్నారో తెలియజేయాలి. ఆ తర్వాత ఎంపిక చేసిన అసెస్‌మెంట్ సంవత్సరం, పన్ను చెల్లింపుదారుల వర్గం, పన్ను చెల్లింపుదారుల వయస్సు, నివాస స్థితి తదితరాలు.. మీరు కాలిక్యులేటర్ అడిగిన వివరాలను ఇవ్వాలి.

ముందుగా మీ జీతం ఆదాయాన్ని నమోదు చేయండి. మీకు ఇంటి నుంచి వచ్చే ఆదాయం (ఇంటిపై చెల్లించే వడ్డీ, అద్దె ద్వారా వచ్చే ఆదాయం), మూలధన ఆదాయం, ఇతర వనరుల నుంచి ఏదైనా ఆదాయం ఉంటే. సంబంధిత విభాగాలలో పూర్తి సమాచారం ఇవ్వండి. పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ఇతర మినహాయింపులకు సంబంధించిన వివరాలను డిడక్షన్ కింద కనిపించే ప్రొవైడ్ ఇన్‌కమ్ డిటెయిల్స్‌పై క్లిక్ చేయడం ద్వారా ఇవ్వాలి.

కొత్త పన్ను విధానంలో తగ్గింపులు వర్తించవు. అందువల్ల, సంబంధిత వివరాలను నమోదు చేయడానికి అవకాశం ఉండదు. పాత పన్ను విధానంలో కొన్ని సెక్షన్ల కింద మినహాయింపులు ఉంటాయి. వాటిని నేరుగా నమోదు చేసుకోవచ్చు.

పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం, మినహాయింపులు మొదలైన వాటి గురించిన సమాచారం నుంచి ఆదాయపు పన్ను శాఖ అందించిన కాలిక్యులేటర్‌ను ఉపయోగించి పన్నును స్వయంగా లెక్కించవచ్చు. ఏ పద్ధతి ప్రయోజనకరమో తెలుసుకుని, ఆ పద్ధతిని ఎంచుకుని, రిటర్నులను సమర్పించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం