Cheapest Electric Car: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే.. ఫీచర్లు సూపరంతే! పూర్తి వివరాలు ఇవి..
ప్రముఖ ఆటోమేకర్ ఎంజీ మోటార్ ఇండియాలో తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యింది. సంస్థ నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తుందని సమాచారం. రూ. 10 లక్షలలోపు ధరతోనే ఇది రానుంది.
దిగ్గజ కంపెనీలు విద్యుత్ వాహనాల తయారీ వేగాన్ని పెంచాయి. ముఖ్యంగా భారత దేశంలో మార్కెట్ పై అనేక సంస్థలు దృష్టి కేంద్రీకరించాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు, అధునాతన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉండే బడ్జెట్‌లో వాహనాలను తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఆటోమేకర్ ఎంజీ మోటార్.. ఇండియాలో తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమయ్యింది. సంస్థ నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్ గా ఇది నిలుస్తుందని సమాచారం. రూ. 10 లక్షలలోపు ధరతోనే ఇది రానుంది. ప్రస్తుతం ఈ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో ఎలక్ట్రిక్ వాహనం పోటీగా దీనిని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను కంపెనీ రిలీజ్ చేసింది. దానిలో కారు ఇంటిరీయర్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూపర్ ఇంటీరియర్..
ఈ ఎంజీ ఎయిర్ ఈవీని ఇండోనేషియాలో ఇప్పటికే ఆవిష్కరించారు. ఎంజీ మోటార్.. ఎయిర్ ఈవీ పేరు మార్చి ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇండియా ప్రమాణాలకు, ప్రజల ఆసక్తులకు తగ్గట్టుగానే.. ఈ వాహనంలో మార్పులు చేయవచ్చు. కాగా.. ఇండియా రోడ్లపై ఈ ఎంజీ ఎయిర్ ఈవీ టెస్ట్ డ్రైవ్లు కూడా మొదలైపోయాయి. ఈ క్రమంలో చాలా సార్లు బయట కనిపించినా దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈసారి కొన్ని వివరాలు తెలిశాయి. ఈ కారు చాలా చిన్నగా ఉంటుంది. ఫుల్ విడ్త్ లైట్ బార్, క్రోమ్ స్ట్రిప్లు.. వెహికిల్ ముందు భాగంలో కనిపిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఈవీకి స్టీల్వీల్స్ఉంటాయి. ఇండియా మార్కెట్లో ఎలాయ్వీల్స్ ఉండొచ్చు. ఎయిర్ క్యాబిన్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ చిత్రాల్లో కనిపిస్తోంది. డ్యాష్‌బోర్డ్ ట్విన్-డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో పెద్ద ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఎన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ఏసీ వెంట్ లు ఎన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కింద ఉంచినట్లు కనిపిస్తోంది.
పరిధి ఇది..
ఎంజీ ఈవీ కారు 20kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకూ మైలేజీ వస్తుంది. దీని ధర టాటా రూ. 8.69 లక్షలు(ఎక్స్ షోరూం) అంటే మన దేశంలోని అతి తక్కువ ధర కలిగిన టాటా టియాగో కంటే తక్కువ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..