AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. పతంజలి స్టోర్ ఎలా ప్రారంభించాలో తెలుసా..?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రంతో ఆయుర్వేద ఉత్పత్తులను సామాన్యుడికి చేరువ చేసిన సంస్థ పతంజలి. ప్రస్తుతం మార్కెట్లో పతంజలి ఉత్పత్తులకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా స్టోర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను కంపెనీ మరింత సులభతరం చేసింది. మీరు కూడా మీ ప్రాంతంలో పతంజలి స్టోర్ తెరవాలనుకుంటున్నారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Patanjali: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. పతంజలి స్టోర్ ఎలా ప్రారంభించాలో తెలుసా..?
How To Start A Patanjali Store
Krishna S
|

Updated on: Jan 30, 2026 | 6:31 PM

Share

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయుర్వేద ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఎఫ్.ఎమ్.సి.జి రంగంలో పతంజలి సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధించి ప్రతి ఇంటికీ చేరువైంది. ఈ క్రమంలో పతంజలి స్టోర్ ప్రారంభించి లాభదాయకమైన వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. మీ బడ్జెట్, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి మూడు రకాలుగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు కనీసం 200 చదరపు అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. పతంజలి ఆసుపత్రులకు మధ్య తరహా విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేయవచ్చు. మెగా స్టోర్‌లకు కనీసం 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ స్థాయిలో వీటిని నిర్వహించవచ్చు.

పెట్టుబడి – సెక్యూరిటీ డిపాజిట్

పతంజలి స్టోర్ ప్రారంభించడానికి పెట్టుబడి వ్యయం మీరు ఎంచుకునే స్టోర్ రకాన్ని బట్టి మారుతుంది. చిన్న దుకాణం అయితే రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడి అవసరం. మెగా స్టోర్ అయితే సుమారు రూ.1 కోటి వరకు ఖర్చవుతుంది. మొత్తంగా రూ.5 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇందులో రూ.2.5 లక్షలు దివ్య ఫార్మసీ పేరు మీద, మిగిలిన రూ.2.5 లక్షలు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.

కావలసిన పత్రాలు

దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి..

  • ఆధార్ కార్డ్, పాన్ కార్డ్
  • నివాస, దుకాణ చిరునామా పత్రాలు
  • సొంత స్థలమైతే దానికి సంబంధించిన పత్రాలు లేదా అద్దె ఒప్పందం
  • ప్రతిపాదిత దుకాణం లేదా ప్రాంగణం యొక్క స్పష్టమైన ఛాయాచిత్రాలు

దరఖాస్తు చేసుకునే విధానం

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: పతంజలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రుసుము చెల్లింపు: దరఖాస్తుతో పాటు రూ.300 రుసుము చెల్లించాలి.

తనిఖీ: మీరు దరఖాస్తు చేసిన తర్వాత కంపెనీ ప్రతినిధులు మీ స్థలాన్ని సందర్శించి తనిఖీ చేస్తారు.

ఆమోదం – ఒప్పందం: స్థలం, పత్రాలు సంతృప్తికరంగా ఉంటే కంపెనీ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకుని స్టాక్ ఆర్డర్ చేయడం ద్వారా స్టోర్ ప్రారంభించవచ్చు.

దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రక్రియ వేగంగా సాగాలంటే కంపెనీ సేల్స్ మేనేజర్‌ను సంప్రదించడం ఉత్తమం. తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఇది ఒక గొప్ప స్వయం ఉపాధి మార్గం.