AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ETF: కేవలం రూ. 1000తో గోల్డ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు! ప్రాసెస్ ఇదిగో..

మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే నగల రూపంలో కాకుండా డైరెక్ట్ గా గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) లో ఇన్వెస్ట్ చేస్తే.. మరిన్ని లాభాలు పొందొచ్చు. కేవలం రూ.1,000 కంటే తక్కువతో గోల్డ్‌ ETF లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Gold ETF: కేవలం రూ. 1000తో గోల్డ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు! ప్రాసెస్ ఇదిగో..
Gold Etf 5
Nikhil
|

Updated on: Oct 25, 2025 | 12:52 PM

Share

ఈటీఎఫ్ అంటే ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అర్థం. ఇవి ప్రపంచవ్యా్ప్తంగా బంగారం ధరలను బట్టి మారుతుంటాయి.  గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF )లను కొనుగోలు చేయడం ద్వారా మీరు డైరెక్ట్ గా గోల్డ్ కాయిన్స్ లేదా బార్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసినట్టే. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు.  ఇవి మ్యూచువల్ ఫండ్స్ కిందకు వస్తాయి.  సాధారణ వ్యక్తులు కూడా చాలా తక్కువ మొత్తంతో వీటిలో పెట్టుబడి పెట్టొచ్చు.

సేఫ్ ఆప్షన్

గోల్డ్ ఈటీఎఫ్ అనేది అసలు బంగారం ధరతో ముడిపడి ఉన్న ఎక్స్ఛేంజ్- ట్రేడెడ్ ఫండ్. మీరు నగలు లేదా నాణేలు కొనుగోలు చేయవలసిన అవసరం లేకుండా వీటిని కొనుగోలు చేస్తే డైరెక్ట్ గా బంగారంలో పెట్టుబడి పెట్టినట్టే. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి గోల్డ్ ఈటీఎఫ్‌లు సేఫ్ ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు. పైగా వీటిలో పూర్తి పారదర్శకత ఉంటుంది. స్టాక్స్ మాదిరిగానే మీరు వాటిని ఎప్పుడైనా కొనడం అమ్మడం చేయవచ్చు. వీటిని కొనుగోలు చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొటక్  గోల్డ్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఎస్ బీఐ గోల్డ్ ఈటీఎఫ్, హెచ్ డీఎఫ్ సీ గోల్డ్ ఈటీఎఫ్.. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని కొత్త కంపెనీలు ఈటీఎఫ్ లు లాంచ్ చేస్తుంటాయి. అప్పుడు కొత్త ఫండ్ ఆఫర్ (NFO) కింద తక్కువ ధరతోనే ఈటీఎఫ్ లు కొనొచ్చు.

ప్రాసెస్ ఇలా..

  • ముందుగా SEBI ఆమోదం పొందిన మ్యూచువల్ ఫండ్ యాప్ లేదా వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • అక్కడ కొత్త డీమ్యాట్ లేదా ట్రేడింగ్ ఖాతాను ఓపెన్ చేయాలి.
  • ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్స్ లోకి వెళ్లి గోల్డ్ ఈటీఎఫ్(Gold ETF) అని టైప్ చేస్తే.. పలు ఈటీఎఫ్ ఫండ్స్ కనిపిస్తాయి.
  • అందులో మీకు నచ్చిన నిధిని ఎంచుకుని, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు లేదా అమౌంట్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాలి. రూ. 1000 లేదా అంతకంటే తక్కువ మొత్తంతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.
  • పేమెంట్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
  • ఇక ఆ తర్వాత ఎప్పుడైనా మీరు మీ ఈటీఎఫ్ వాల్యు ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. కావాలనుకున్నప్పుడు అమ్మేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.