AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: 130 గజాల ఇంటి నిర్మాణానికి ఎన్ని ఇటుకలు అవసరం.. ధర ఎంత.. పూర్తి డిటేయిల్స్..!

House Construction: ఇటుకల ధరలు వాటి నాణ్యతతో ముడిపడి ఉంటాయి. మంచి నాణ్యత గల ఇటుకలు అధిక మన్నికను కలిగి ఉంటాయి. అలాగే నిర్మాణానికి బలాన్ని చేకూరుస్తాయి. సాధారణంగా మొదటి తరగతి ఇటుకలు అధిక ధరను కలిగి ఉంటాయి. అయితే అవి ఉత్తమ..

House Construction: 130 గజాల ఇంటి నిర్మాణానికి ఎన్ని ఇటుకలు అవసరం.. ధర ఎంత.. పూర్తి డిటేయిల్స్..!
House Construction
Subhash Goud
|

Updated on: Oct 10, 2026 | 6:59 PM

Share

House Construction: ఇంటి నిర్మాణం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇందులో ఇటుకల ఎంపిక, వాటి ఖర్చు కీలక పాత్ర పోషిస్తాయి. ఇటుకలు ప్రస్తుత మార్కెట్ ధరలు, వివిధ రకాలు,130 గజాల స్థలంలో ఇంటిని నిర్మించడానికి ఎన్ని ఇటుకలు అవసరమవుతాయి అనే దానిపై మేస్త్రీలు, బిల్డర్స్‌ వివరాలు అందించారు.

ఇటుకల ప్రస్తుత ధరలు:

ప్రస్తుతం మార్కెట్లో ఇటుకల ధరలు వాటి నాణ్యత, తయారీ పద్ధతి, ప్రాంతాన్ని బట్టి గణనీయంగా మారుతూ ఉంటాయి. 1000 ఇటుకలకు సగటు ధర రూ.7,000 నుండి రూ.7,600 వరకు ఉంది. ఈ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. గ్రామీణ ప్రాంతలు, నగర ప్రాంతాల్లో ధరల్లో తేడా ఉంటుందని గుర్తించుకోండి. అలాంటప్పుడు ధర ఎక్కువ తక్కువ కావచ్చు. ఈ వివరాలు ఒక అంచనా ప్రకారం మాత్రమే. అమలాపురం, బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వంటి కొన్ని ప్రాంతాల్లో 1000 ఇటుకలకు ప్రస్తుతం రూ.7,200 నుండి రూ.7,300 వరకు ధర పలుకుతోంది. ఇటుకల మందం, నాణ్యత బట్టి ఈ ధరలలో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: DMart Business Secret: డీమార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే.. తక్కువ ధరలకు అమ్మినా వేల కోట్ల లాభాలు ఎలా?

ఇటుకల నాణ్యత, ధరపై ప్రభావం:

ఇటుకల ధరలు వాటి నాణ్యతతో ముడిపడి ఉంటాయి. మంచి నాణ్యత గల ఇటుకలు అధిక మన్నికను కలిగి ఉంటాయి. అలాగే నిర్మాణానికి బలాన్ని చేకూరుస్తాయి. సాధారణంగా మొదటి తరగతి ఇటుకలు అధిక ధరను కలిగి ఉంటాయి. అయితే అవి ఉత్తమ నాణ్యతను అందిస్తాయి. రెండవ, మూడవ కేటగిరి ఇటుకలు తక్కువ ధరకు లభిస్తాయి. కానీ వాటి నాణ్యత, మన్నిక తక్కువగా ఉండవచ్చు. నిర్మాణ అవసరాలు, బడ్జెట్ ఆధారంగా సరైన ఇటుకలను ఎంచుకోవడం ముఖ్యం.

ఇటుక రవాణా, ఖర్చు:

ఇటుకలను సాధారణంగా ట్రక్కుల ద్వారా రవాణా చేస్తారు. ఒక సాధారణ ట్రక్కులో 5,000 నుండి 6,000 ఇటుకలు పడతాయి. ఈ ట్రక్కు ఇటుకల రవాణా ఖర్చుతో కలిపి సుమారు రూ.35,000 నుండి రూ.36,000 వరకు ఉంటుంది. రవాణా దూరం, ఇంధన ధరలు, స్థానిక రవాణా ఛార్జీలను బట్టి ఈ ఖర్చు మారవచ్చు.

130 గజాల ఇంటికి అవసరమైన ఇటుకల అంచనా:

సుమారు 1200 చదరపు అడుగులు (లేదా 3 సెంట్లు లేదా 130 గజాలు) విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి అవసరమైన ఇటుకల సంఖ్యను అంచనా వేయడం నిర్మాణం ప్రారంభించే ముందు కీలకమైన దశ. ఒక సాధారణ అంచనా ప్రకారం, చుట్టూ కాంపౌండ్ వాల్‌తో కలిపి 130 గజాల ఇంటి నిర్మాణానికి దాదాపు 25,000 ఇటుకలు అవసరం అవుతాయని మేస్త్రీలు, బిల్డర్లు చెబుతున్నారు. ఈ అంచనా ఇంటి డిజైన్, గోడల మందం, అంతస్తుల సంఖ్య, కాంపౌండ్ వాల్ పరిమాణం వంటి అంశాలపై ఆధారపడి మారుతుంది.

మొత్తం ఖర్చు అంచనా:

ఒక 130 గజాల ఇంటికి 25,000 ఇటుకలు అవసరమైతే, 1000 ఇటుకల ధర రూ.7,200 అనుకుంటే, మొత్తం ఇటుకల ఖర్చు సుమారు రూ.1,80,000 (25,000/1000 ఇటుకలకు రూ.7,200) అవుతుంది. దీనికి రవాణా ఖర్చులు అదనం. ఇది కేవలం ఇటుకల ఖర్చు మాత్రమే, మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం వివిధ ఇతర సామగ్రి, శ్రమ ఖర్చులతో కలిపి గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. ఇంటి నిర్మాణం అనేది ఒక పెద్ద పెట్టుబడి, కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం అవసరం. ఇటుకల ధరలు మరియు అవసరమైన పరిమాణంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం నిర్మాణ బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Big Sales: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో బిగ్గెస్ట్‌ సేల్స్‌.. సగం ధరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గాడ్జెట్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us