House Buying: మీరు బిల్డర్ నుంచి ఇల్లు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు

ఇల్లు కొనడం అనేది జీవితంలోని అతి పెద్ద నిర్ణయాలలో ఒకటి. మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఇల్లు కొనుగోలు..

House Buying: మీరు బిల్డర్ నుంచి ఇల్లు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు
House Buying
Follow us
Subhash Goud

|

Updated on: Mar 11, 2023 | 12:43 PM

ఇల్లు కొనడం అనేది జీవితంలోని అతి పెద్ద నిర్ణయాలలో ఒకటి. మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఇల్లు కొనుగోలు విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలి. బిల్డర్‌ నమ్మకం గల వ్యక్తేనా కాదా? అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ప్రాపర్టీస్‌ క్రయ విక్రయాలలో మోసాలు జరుగుతుంటాయి. సరైన వసతులు లేకపోవడం, మీరు కొనుగోలు చేసే ప్రాంతంలో డెవలప్‌మెంట్‌ లేకపోవడం, సరైన ధరలు లేకపోవడం తదితర కారణాలు ఉండవచ్చు. కానీ మీకు బిల్డర్‌ నమ్మబలికి ఇల్లును విక్రయించడం వల్ల తర్వాత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రకారం.. మే 2022 నాటికి దేశంలోని టాప్ 7 నగరాల్లో దాదాపు 4.8 లక్షల ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. దీని విలువ 4.48 లక్షల కోట్ల రూపాయలు. ఎన్‌సిఆర్‌లో 2.4 లక్షలకు పైగా నిలిచిపోయిన లేదా ఆలస్యమైన ఇళ్లు ఉన్నాయి. అయితే ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ సంఖ్య 1.28 లక్షలు. ఇందులో ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణే, హైదరాబాద్, 2014లో లేదా అంతకు ముందు ప్రారంభించిన ప్రాజెక్టులు ఉన్నాయి. నోయిడా, గ్రేటర్ నోయిడాలో మాత్రమే ఇరుక్కుపోయిన ఇళ్ల సంఖ్య 1,65,348 కాగా, గురుగ్రామ్‌లో 30,733, ఘజియాబాద్‌లో 22,128 ఉన్నాయి.

సరైన ప్లాన్‌ లేకుండా కేవలం బిల్డర్ మాటల ఆధారంగా ఇంటిని కొనుగోలు చేయడం వలన మీరు పెద్ద సమస్యలో పడవచ్చు. వందలాది మంది ప్రజలు తమ ఇంటిని స్వాధీనం చేసుకోవడం, రిజిస్టర్‌ చేసుకోవడం కోసం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. హేమంత్ లాగా, మీరు మీ బిల్డర్ గురించి కూడా తెలుసుకోవచ్చు. బిల్డర్‌ని గుడ్డిగా నమ్మి మూల్యం చెల్లించుకుంటారు. బిల్డర్లందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీ బిల్డర్ నమ్మదగినవాడా కాదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం నీటిలో పోసినట్లయవుతుంది. మరి దేశంలో చాలా ఇల్లు ఇలాంటి సమస్యల్లో చిక్కుకున్నాయి.

ఇవి కూడా చదవండి

బిల్డర్ ట్రాక్ రికార్డ్‌ను చెక్ చేయడం ముఖ్యం. మీరు ఒక నిర్దిష్ట ప్రాజెక్ట్ ఇల్లు, భూమి లేదా వాణిజ్యపరమైన ఆస్తిని కొనుగోలు చేస్తుంటే ఆ స్థలాన్ని సందర్శించి ముందుగా దాన్ని తనిఖీ చేయండి. అదనంగా బిల్డర్ గత ప్రాజెక్ట్‌లను పరిశోధించండి. బిల్డర్ ప్రాజెక్ట్‌ను సకాలంలో డెలివరీ చేశారా లేదా అని తనిఖీ చేయండి. వారు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? మీరు అక్కడ నివసిస్తున్న వ్యక్తులతో మాట్లాడటం ద్వారా నిజాలు తెలుసుకోవచ్చు. ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి బిల్డర్ వద్ద తగినంత నిధులు ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోండి

ప్రాజెక్టుకు బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయా? లేదా అనే విషయాన్ని స్పష్టంగా తెల్సుకోవాలి. సాధారణంగా ప్రధాన బ్యాంకులు వివాదాలతో ఆస్తులపై గృహ రుణాలు ఇవ్వకుండా ఉంటాయి. ఒక ప్రాజెక్ట్‌కు ఫైనాన్స్ చేయడానికి ముందు బ్యాంకులు సమగ్ర విచారణను నిర్వహిస్తాయి. బిల్డర్ అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నాడా లేదా అనే విషయాన్ని కూడా వారు బిల్డర్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తారు. బ్యాంకు ద్వారా గృహ రుణం కోసం ప్రాజెక్ట్ ఆమోదించబడితే, మీరు అక్కడ ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరిగినా లేదా ఏదైనా చట్టపరమైన వివాదం తలెత్తినా.. అలాంటప్పుడు ఇప్పటికే ఆమోదించబడిన ప్రాజెక్ట్‌ల కోసం తాజా రుణ దరఖాస్తులను బ్యాంక్ తిరస్కరించవచ్చు. RERAతో సహా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే అంశాలను కూలంకషంగా పరిశీలించాలి.

బిల్డర్ నిజమైన వ్యక్తి అయితే మీకు అవసరమైన ఆమోదాలను చూపడంలో అతనికి ఎలాంటి సమస్యలు ఉండకూడదు. RERA రిజిస్ట్రేషన్, కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఇతర ఆమోదాల పత్రాలను చూపించడానికి బిల్డర్ వెనుకాడినట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు చేయకుండా ఉండండి. అటువంటి ప్రాజెక్ట్‌లలోని ఆస్తి అదనంగా మీరు ఆస్తి టైటిల్ బిల్డింగ్ ప్లాన్, భూ వినియోగంలో మార్పులు, భూమిపై పెండింగ్‌లో ఉన్న బకాయిలు వంటి అంశాలను కూడా ధృవీకరించాలి. అలాగే భూమికి వ్యతిరేకంగా ఎటువంటి చట్టపరమైన వివాదాలు లేదా రుణాలు లేవని నిర్ధారించుకోండి.

సాధారణంగా సకాలంలో ఇంటి డెలివరీ బిల్డర్ చేయకపోవడం పెద్ద సమస్యగా ఉంటుంది. అటువంటి సందర్భంలో చెల్లింపు, నిర్మాణంలో జాప్యానికి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులను జాగ్రత్తగా తనిఖీ చేయండి. బ్రోచర్‌లో చేసిన వాగ్దానాలు ఒప్పందంలో కూడా ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోండి. తద్వారా బిల్డర్ ఏదైనా తప్పు చేస్తే మీరు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఒప్పందంలోని ఏవైనా నిబంధనలతో మీరు సంతృప్తి చెందకపోతే దాని నుంచి బయట పడటానికి బిల్డర్‌తో మాట్లాడండి. ఇలా ఇంటి కొనుగోలు చేసే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..