Hotel Service Charge: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఇకపై సర్వీస్‌ చార్జీలకు నో ఛాన్స్..

|

Jul 04, 2022 | 6:38 PM

సర్వీస్ ఛార్జీ విషయంలో చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి సర్వీస్ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆగ్రహించింది. వినియోగదారులు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915లో ఫిర్యాదు చేయవచ్చని CCPA తెలిపింది.

Hotel Service Charge: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. హోటళ్లు, రెస్టారెంట్లలో ఇకపై సర్వీస్‌ చార్జీలకు నో ఛాన్స్..
Hotel Service Charge
Follow us on

Hotel Service Charge: రెస్టారెంట్‌లో వసూలు చేసే సర్వీస్ ఛార్జ్‌ల గురించి కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. రెస్టారెంట్, హోటళ్లకు షాకిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార బిల్లులపై డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించకూడదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సోమవారం తీర్పు వెల్లడించింది. వీటిని ఇతర పేర్లతోనూ సేవా రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది. అలాగే ఇది పూర్తిగా ఐచ్ఛికమని కస్టమర్‌కు చెప్పాలని సూచించింది. ఆహార బిల్లుకు సర్వీస్ ఛార్జ్ ఎట్టి పరిస్థితుల్లో జోడించకూడదు, దానిపై GST కూడా విధించకూడదని పేర్కొంది. కాగా, సర్వీస్ ఛార్జీల విషయంలో ఇటీవల వివాదం నెలకొన్న పరిస్థితి తెలిసిందే. పబ్లిక్ స్టాండ్ తీసుకొన్న ప్రభుత్వం.. హోటల్స్, రెస్టారెంట్‌లను సర్వీస్ ఛార్జ్ తీసుకోవడానికి నిబంధనలు ఏంటి, దానికి ఎంత వసూలు చేస్తున్నారంటూ అడిగింది. అనంతరం హోటళ్లతో సమావేశం కూడా నిర్వహించారు. చివరకు సర్వీస్‌ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది.

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ)తో నిర్వహించిన తొలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగం (డీఓసీఏ) సర్వీస్ ఛార్జీ విధించవద్దని కోరింది. ఈమేరకు ప్రభుత్వం దీనిపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఫుడ్ బిల్లులపై ఎలాంటి సర్వీస్ ఛార్జీలు వసూళ్లు చేయలేరు.

ఆర్డర్‌లో ఏముందంటే?

ఇవి కూడా చదవండి

హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని ఫుడ్ బిల్లుతో కలపకూడదని, ఆ మొత్తానికి జీఎస్టీని వసూలు చేయకూడదని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీలను పేరు మార్చడం ద్వారా లేదా మరేదైనా పేరుతో కస్టమర్ నుంచి సర్వీస్ ఛార్జీని వసూలు చేయలేరని అందులో పేర్కొంది. ప్రస్తుతం సర్వీస్ పేరుతో కస్టమర్ల నుంచి విచ్చల విడిగా డబ్బులు తీసుకోలేరు. ఒకవేళ ఈ రూల్స్ పాటించకుండా డుబ్బు వసూళ్లు చేస్తే, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915లో ఫిర్యాదు చేయవచ్చని CCPA తెలిపింది.

సర్వీస్ ఛార్జీ ఎంత ఉంటుంది..

హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు చివర్లో సేవా రుసుము విధిస్తున్నట్లు పేర్కొంటారు. ఇది సాధారణంగా బిల్లులో ఒక శాతం నుంచి 5 శాతంగా ఉండొచ్చు. అంటే ఉదాహరణకు బిల్లు రూ. 1,000 అయితే, 5% సర్వీస్ ఛార్జీ కలిసితే అప్పుడు బిల్లు రూ. 1,050 అవుతుంది.