AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda QC1: అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఈవీ స్కూటర్లను వినియోగించడాన్ని ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. భారతీయ స్కూటర్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న హోండా ఇటీవల హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ స్కూటర్ ఫస్ట్ రివ్యూ వచ్చింది. కాబట్టి ఈ స్కూటర్ రివ్యూ ఎలా ఉందో? ఓ లుక్కేద్దాం.

Honda QC1: అదిరిపోయిన హోండా ఈవీ స్కూటర్.. ఫస్ట్ అండ్ బెస్ట్ రివ్యూ ఇదే..!
Honda Qc1
Nikhil
|

Updated on: Mar 29, 2025 | 3:30 PM

Share

హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ మార్కెట్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్  ద్విచక్ర వాహనంగా ఉంది. ఈ స్కూటర్‌ను ఇటీవల బెంగళూరులోని రద్దీగా ఉండే వీధుల్లో టెస్ట్ రైడ్ నిర్వహించారు. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ స్థిర 1.5 కేడబ్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 80 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ బ్యాటరీని 80 శాతం ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు, పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6.5 గంటలు పడుతుంది. అయితే ఈ స్కూటర్‌కు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందుబాటులో లేదు. క్యూసీ-1 ఈవీ స్కూటర్ రెండు మోడ్‌లలో వస్తుంది. ఎకో, స్టాండర్డ్ మోడ్స్‌లో ఈ స్కూటర్‌పై దూసుకుపోవచ్చు క్యూసీ-1 ఎకో మోడ్‌లో 30 కిమీ గరిష్ట వేగంతో, స్టాండర్డ్‌లో 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. వంద శాతం చార్జింగ్‌తో 49.1 కిలోమీటర్ల ప్రయాణించేసరికి 13 శాతాని చేరిందని రివ్యూవర్స్ చెబుతున్నారు. 

హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ 1.8 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ హబ్-మౌంట్ మోటారుతో పట్టణ రైడర్లను ఆకట్టుకునే విధంగా ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారని రివ్యూవర్స్ పేర్కొంటున్నారు. ఈ స్కూటర్ మోటర్ ద్వారా సింపుల్‌గా గంటకు  40 నుంచి 50 కి మీ వేగంతో దూసుకుపోవచ్చని పేర్కొంటున్నారు. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ సీటు ఎత్తు 769 ఎంఎంగా ఉంది. అందువల్ల 5 అడుగుల ఎత్తు ఉన్న రైడర్లకు ఫ్లాట్ ఫూటింగ్ సమస్య ఉండదు. క్యూసీ-1 రెండు యాక్సిల్స్ వద్ద డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. మృదువైన రైడింగ్‌ను ఈ స్కూటర్ ద్వారా పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ ఫ్రంట్-ఎండ్ డిజైన్ బాగా ఇంటిగ్రేటెడ్, సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్‌తో ఫ్లష్‌గా ఉంది. ఫెండర్‌లో బ్లాక్ పైపింగ్ వల్ల డ్యూయల్ టోన్ టచ్‌తో ఆకర్షిస్తుంది. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. 

హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ మొత్తం మార్కెట్‌లో కనీసం 50 శాతానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కూటర్ ఐదు అంగుళాల కలర్డ్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో చార్జింగ్ స్టేటస్, ట్రిప్, ఓడోమీటర్, వేగాన్నిచూడవచ్చు. అండర్ సీటు కింద నిల్వ స్థలం 26 లీటర్లుగా ఉంది. హాఫ్ హెల్మెట్‌తో పాటు ఇతర వస్తువులను ఉంచడానికి స్థలం ఉంటుంది. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ బ్యాటరీ, వాహనంపై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ ధర రూ. 90,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. హోండా క్యూసీ-1 ఈవీ స్కూటర్ ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎయిర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి