Richest Women: ఆస్తిలోనూ అతివల హవా.. టాప్-10 రిచెస్ట్ మహిళల్లో భారతీయ మహిళ ఈమే..!
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులైన మహిళల్లో స్థానం సంపాదించిన మొదటి భారతీయ మహిళగా నిలిచి అరుదైన ఘనతను సాధించారు. ఆమె నికర ఆస్తి విలువ రూ. 3.5 లక్షల కోట్లు (40 బిలియన్ల యూఎస్ డాలర్లు). హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఐదో స్థానంలో నిలిచింది.

రోష్ని తండ్రి శివ్ నాడార్ ఆమెకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 47 శాతం వాటా ఇచ్చిన తర్వాత ఆమె భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన బిలియనీర్లలో ఒకరిగా మారింది. 2025 నాటికి భారతదేశంలో మూడవ అత్యంత ధనవంతురాలిగా ఉంది. రోష్ని నాడార్ 48 బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా ఉంది. ఆమె కార్పొరేషన్‌కు సంబంధించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) బోర్డు కమిటీకి కూడా నాయకత్వం వహిస్తుంది. రోష్ని నాడార్ నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందింది. ఆమె కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందింది. అయితే ఆమె దాతృత్వంలో కూడా తన మంచి మనస్సును చాటుకుంది. ఆమె కృషిని మెచ్చుకుంటూ 2023లో షాఫ్నర్ అవార్డుతో సత్కరించారు. ఆమె శివ నాడార్ ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉంది. లీడర్‌షిప్‌తో పాటు విద్యా కార్యక్రమాల్లో 1.2 బిలియన్ల డాలర్లకు పైగా నిర్వహిస్తుంది. తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి ప్రతిభావంతులైన పిల్లలను అభివృద్ధి చేసే ఉత్తరప్రదేశ్ నాయకత్వ సంస్థ విద్యాజ్ఞాన్ ద్వారా ఆమె సేవలు చేస్తుంది.
రోష్ని నాడార్ ది నేచర్ కన్జర్వెన్సీకు సంబంధించిన గ్లోబల్ బోర్డుతో పాటు, ఎంఐటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో డీన్స్ అడ్వైజరీ కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉంది. 2017 నుంచి ఆమె ఫోర్బ్స్ ప్రకటించే ప్రపంచంలోని టాప్ 100 మహిళల్లో ఒకరిగా ఉంటున్నారు. 2024లో రోష్ని నాడార్ ఫ్రాన్స్‌కు సంబంధించిన చెవాలియర్ డి లా లెజియన్ డి’హానర్‌ను అందుకుంది. ఈ సంవత్సరం హురున్ గ్లోబల్ రిచ్ జాబితాలో 561 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. వారిలో 224 మంది స్వయం సమృద్ధిగా ఎదిగిన వారు ఉన్నారు.
ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ (ఫ్రాన్స్)-67 బిలియన్ డాలర్లు
సౌందర్య సాధనాల రంగంలో లోరియల్ ఆధిపత్యం కొనసాగినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లోని ఇబ్బందుల ఫలితంగా కంపెనీ వారసురాలిగా బెటెన్‌కోర్ట్ మేయర్స్ సంపద 26 శాతం తగ్గింది.
ఆలిస్ వాల్టన్-102 బిలియన్ డాలర్లు
ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన ఆలిస్ వాల్టన్. వాల్మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె. వాల్మార్ట్ షేర్ ధర పెరుగుదల ఆమె సంపదను 46 శాతం పెంచింది.
జాక్వెలిన్ మార్స్-53 బిలియన్ డాలర్లు
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల ఆహార మార్కెట్ మార్స్ ఇంక్. వారసురాలు 33 శాతం సంపద వృద్ధికి ప్రధాన కారకం.
జూలియా కోచ్ & ఫ్యామిలీ-60 బిలియన్ డార్లు
వ్యాపారవేత్త, రాజకీయ కార్యకర్త డేవిడ్ కోచ్ మరణించడంతో జూలియా కోచ్‌కు ఆమె డబ్బు వచ్చింది. కోచ్ ఇండస్ట్రీస్‌లో ఆమె కుటుంబం పెట్టుబడి ఇప్పటికీ గణనీయమైన లాభాలను ఆర్జిస్తోంది.
అబిగైల్ జాన్సన్ 32 బిలియన్ డాలర్లు
ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సీఈఓకు పనిచేస్తున్నప్పుడు జాన్సన్ తన సంపదను 14 శాతం పెంచుకున్నారు. ఈ సంస్థ నిర్వహణలో దాదాపు యూఎస్ 400 బిలియన్ల డాలర్ల ఆస్తులను సేకరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి