
ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో క్రెడిట్, డెబిట్ కార్డులు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ముఖ్యంగా డబ్బు లావాదేవీలను సులభతరం చేసింది. డెబిట్ కార్డుల మన అకౌంట్‌లో ఉన్న నిల్వ ఆధారంగా పని చేస్తాయి. అయితే క్రెడిట్ కార్డులు మాత్రం మనకు ఆ కంపెనీల ఇచ్చిన లిమిట్ ఆధారంగా పని చేస్తాయి. ముఖ్యంగా వస్తువులు, సేవలకు సంబంధించిన చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డ్‌లు అత్యంత ఉపయోగకరమైన మార్గాలలో ఒకటిగా మారాయి. ఎందుకంటే ఇవి వినియోగదారుని నిర్ణీత వ్యవధి తర్వాత చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. చెల్లింపు చేయడానికి సాధారణంగా ఒక నెల సమయం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డుల ట్రెండ్ పెరుగుతోంది. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు, షాపింగ్, మరెన్నో అవసరాలకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రస్తుతం క్రెడిట్ కార్డును ఉపయోగించి ఇంటి రెంట్‌ను ఎలా చెల్లించాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఇంటి యజమాని క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులను అంగీకరించకపోయినా థర్డ్-పార్టీ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపులు చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల చాలా రివార్డ్‌లను కూడా అందించవచ్చు. దేశంలో పేటీఎం, ఫోన్‌పే, క్రెడ్, నో బ్రోకర్, పేజాప్, రెడ్ జిరాఫీ వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, యూపీఐ యాప్‌లు వినియోగదారులను క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులను చేయడానికి అనుమతిస్తాయి. యజమాని బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను నమోదు చేయడం ద్వారా అద్దెను సులభంగా బదిలీ చేయవచ్చు. రూ.50,000 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే అప్పుడు యజమాని పాన్ కార్డ్ నంబర్ కూడా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..