AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోమ్‌ లోన్‌ పూర్తిగా కట్టేసిన తర్వాత చేయాల్సిన మోస్ట్‌ ఇంపార్టెంట్‌ పనులు ఇవే! లేదంటే..

హోమ్ లోన్ EMIలు పూర్తయిన తర్వాత మీ ఆస్తిపై పూర్తి యాజమాన్యం పొందడానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి. బ్యాంకు నుండి అసలు పత్రాలు, NOC (నో డ్యూస్ సర్టిఫికేట్) పొందండి. లోన్ తీరాక, ఆస్తిపై ఉన్న తాకట్టును రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రద్దు చేయించండి.

హోమ్‌ లోన్‌ పూర్తిగా కట్టేసిన తర్వాత చేయాల్సిన మోస్ట్‌ ఇంపార్టెంట్‌ పనులు ఇవే! లేదంటే..
Home Loan
SN Pasha
|

Updated on: Nov 06, 2025 | 7:45 AM

Share

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చాలా మంది తమ ‘కలల ఇల్లు’ కొనడానికి హోమ్‌ లోన్‌ తీసుకొని EMIలు చెల్లిస్తారు. అయితే EMI పూర్తయిన తర్వాత కూడా ఆస్తికి సంబంధించి ఎటువంటి చట్టపరమైన లేదా రికార్డు సంబంధిత సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి. బ్యాంకు నుండి అన్ని అసలు పత్రాలను పొందండి. మీరు లోన్‌ తీసుకున్నప్పుడు ఆస్తికి సంబంధించిన పత్రాలు బ్యాంకుకు ఇచ్చి ఉంటే వాటిని లోన​ ముగిసిన వెంటనే అడిగి మరీ తీసుకోండి. దాంతో పాటు టైటిల్ డీడ్, సేల్స్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, లింక్ డాక్యుమెంట్లు కూడా కావాలని లిఖిత పూర్వకంగా అడగండి. నిబంధనల ప్రకారం.. రుణం ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకు ఈ పత్రాలను మీకు తిరిగి ఇవ్వాలి.

తరువాత మీరు బ్యాంకు నుండి నో డ్యూస్ సర్టిఫికేట్ (NOC) పొందాలి. ఈ సర్టిఫికేట్ మీ రుణం పూర్తిగా తిరిగి చెల్లించబడిందని, బ్యాంకుకు మీ ఆస్తిపై ఇకపై ఎటువంటి హక్కు లేదని రుజువు చేస్తుంది. ఈ సర్టిఫికేట్‌లోని మీ పేరు, లోన్ ఖాతా నంబర్, ఆస్తి చిరునామా, లోన్ మొత్తం మరియు ముగింపు తేదీ వంటి సమాచారాన్ని తనిఖీ చేయండి. మీరు హోమ్‌ లోన్‌ తీసుకున్నప్పుడు బ్యాంకు మీ ఆస్తిపై ‘తాకట్టు’ (తనఖా తీసుకునే హక్కు) నమోదు చేస్తుంది. లోన్‌ పూర్తిగా చెల్లించిన తర్వాత ఈ ‘తాకట్టు’ను తొలగించడం మీ బాధ్యత. దీన్ని చేయడానికి మీరు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి NOC అలాగే పత్రాలను సమర్పించాలి. ‘తాకట్టు’ తొలగించబడిన తర్వాత మాత్రమే, మీరు ఆస్తికి పూర్తి చట్టపరమైన యజమాని అవుతారు.

అలాగే నాన్-ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (NEC) ఆస్తికి సంబంధించిన అన్ని లావాదేవీల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది. రుణం అమలులో ఉన్నప్పుడు ఇది లోన్‌ రికార్డుగా ఉంటుంది కానీ లోన్‌ ముగిసిన తర్వాత అప్డేట్‌. దీన్ని చేయడానికి ఆస్తిపై బకాయిలు లేదా తనఖా రికార్డుగా ఉండకుండా ఉండటానికి NOCతో పాటు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి ఒక దరఖాస్తును సమర్పించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి