Hiring Trends 2021: అందరి దృష్టి ప్రొఫెషనల్ జాబ్స్ వైపే.. ఆసక్తికర విషయలు వెల్లడించిన డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు..
Hiring Trends 2021: భారత ఐటీ రంగం కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం పెద్ద, చిన్న కంపెనీలు పోటీ పడుతుండటం
Hiring Trends 2021: భారత ఐటీ రంగం కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం పెద్ద, చిన్న కంపెనీలు పోటీ పడుతుండటం ఈ అంశాన్ని మరింత ధృవీకరిస్తోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలు, డేటా విశ్లేషణ, ప్రస్తుత పరిస్థితులు.. ఐటీ కంపెనీలు కరోనా సంక్షోభం నుంచి కోలుకుని ముందుకు వెళ్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి.
ఐటీ కంపెనీలలో నియామకాలు భారీగా ఉంటాయి. అయితే, ఒక ఉత్పత్తి కంపెనీతో పోల్చి చూస్తే మాత్రం నియామకాలకు సంబంధించి చాలా తేడాలు కనిపిస్తుంటాయి. ఉత్పత్తి రంగానికి సంబంధించి ఆర్&డి విభాగంలో ఇప్పుడు ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయి. ఇది గ్లోబల్ టాలెంట్ పూల్ అండ్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ డిమాండ్‌లో వచ్చే మార్పులను స్పష్టం చేస్తుంది. అయితే, ఇది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఐటీ నియామకాలకు సంబంధించి.. ఐటీ హైరింగ్ ట్రెండ్స్-2021 పేరుతో జరిపిన సర్వేలో డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకులు రోహిత్ చెన్నమనేని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి నియామక ప్రక్రియను మార్చిందని మీరు అనుకుంటున్నారా? అవునంటే.. ఎందుకు, ఎలా? కరోనా మహమ్మారి కొన్ని రంగాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. ఉదాహరణకు, ఐటీ పరిశ్రమనే తీసుకుంటే, గణనీయమైన మార్పు వచ్చిందని చెప్పాలి. కోవిడ్ కారణంగా.. ఆటోమేషన్ విధానానికి తెరలేపినట్లయ్యింది. ప్రస్తుతం చాలా మంది కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నారు. ఐటీకి సంబంధించి.. హెచ్ఆర్ అనలిటిక్స్‌ని చూస్తున్న ఎక్కువ మందిని మేము పరిశీలించాము. చాలా మంది తమ వర్క్ ప్లేస్‌లలో టెక్నాలజీని పెంచుకున్నారు. మనుషులకంటే.. రియోట్ సిస్టమ్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు.. తమ పనులను ఆటోమేట్ చేయడానికి ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో.. ఐటీలో నియమకాలు భారీగా పెరిగాయి. జీతాలు కూడా భారీగా ఉన్నాయి. గతంలో పోలిస్తే ఈ ఏడాది సగటు జీతాలు గణనీయంగా పెరిగాయి. అన్నికంటే ఎక్కువగా వైట్ కాలర్ నియామకాలలో భారీ మార్పులను చూశాం. కానీ, బ్లూ కాలర్ ఉద్యోగాల నియామకాలు తగ్గాయని చెప్పాలి.
ఐటీలో ఉద్యోగ నియామకాలు పెరుగుదల వెనుక ఏదైనా కారణం ఉందా? ఐటీ రంగంలో మంచి ప్రతిభకు కొరత ఉంది. ఆ కారణంగా చాలా కంపెనీలు క్యాంపస్ నుంచే నియామకాలు చేపడుతోంది. తద్వారా ప్రతిభావంతులను ముందుగానే టేకోవర్ చేసుకునే పనిలో కంపెనీలు ఉన్నాయి. గతేడాది ఐటీ రంగం అభివృద్ధిపై అనుమానాలుండేవి. ఈ అభివృద్ధి తాత్కాలికమా? కొనసాగుతుందా? అనే మీమంశలు ఉద్యోగుల్లో ఉండేవి. కానీ, ఈ సంవత్సరం మాత్రం అలాంటి సందేహాలేమీ లేవు. ఐటీ సెక్టార్‌కు సంబంధించి.. కరోనా పరిస్థితులు ఉన్నా అంతా సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే.. కంపెనీలు సైతం భారీగా నియామకాలు చేపడుతున్నాయి. 2020లో క్యాంపస్ నియామకాలకు సంబంధించి కొద్దిగా అనుమానాలు ఉండేవి. అయితే, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధివైపు దూసుకుపోతోంది. ఆ మేరకు మరిన్ని సవాళ్లను స్వీకరించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా కంపెనీలు క్యాంపస్ నియామకాలు, కొత్త ఉద్యోగాల కల్పనను ముమ్మరం చేశాయి. వాస్తవానికి 2020లో పరిస్థితులు ప్రతీకూలంగా ఉండటంతో క్యాంపస్ నియామకాలు, శిక్షణ ఇవ్వడం వంటివి పూర్తిగా నిలిపివేశారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లు పుంజుకోవడంతో.. నియామకాల్లో వేగం పెరిగింది.
కాలక్రమేణా నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందాయా? విస్తృత నైపుణ్యాభిద్ధి అంటూ పెద్దగా ఏమీ లేదు. కానీ ప్రస్తుతం అందరి దృష్టి.. ప్రతిభ కలిగిన వ్యక్తుల కోసం వేట సాగుతోంది. చాలా కంపెనీలు.. అభ్యర్థుల టాలెంట్, సెల్ఫ్ స్టార్టర్ వంటి లక్షణాలను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ టాలెంట్ దాగి ఉంటుంది. అందుకే క్యాంపస్ సెలక్షన్లపై కంపెనీలు ఫోకస్ చేశాయి.
డిమాండ్-సప్లయ్ స్థిరీకరించడాన్ని మీరు చూస్తున్నారా? ఈ విషయంలో ఉత్పత్తి కంపెనీలకు, ఐటీ రంగానికి కొంత తేడా ఉంటుంది. ఐటీ సెక్టార్‌లో నియామకాలు అధికంగా ఉంటాయి. ఒక ఉత్పత్తి సంస్థతో పోలిస్తే ఐటీ సెక్టార్‌కు చాలా తేడాలు కనిపిస్తాయి. ఆర్ అండ్ డీ కోసమే ఎక్కువ నియామకాలు జరుగుతాయి. అందువల్ల.. టాలెంట్ కలిగిన ఇంజనీర్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది ప్రతిభ అనే విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. ప్రోడక్ట్ ఇంజనీర్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ తగ్గుతదని మాత్రం భావించలేం. డిమాండ్‌కు తగ్గట్లుగా ఎంప్లాయిస్ కూడా ఉంటారు.
WFX సంస్కృతి .. ఇది కొత్త సాధారణమైనది కాదా? కరోనా కారణంగా.. దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఏనీవేర్ ఛాన్స్ ఇస్తున్నాయి. మా విషయానికి వస్తే.. చిన్న టీమ్‌లు ఉన్న కంపెనీల్లో తప్ప 100 శాతం WFX సాధ్యం కాదు. సహోద్యోగులను కలవడంతో కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. వర్క్‌కు సంబంధించి లెర్నింగ్, షేరింగ్ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, మేము పూర్తిగా యాంత్రీకరణగా మారేందుకు సిద్ధంగా లేము. వారానికి లేదా 15 రోజులకు ఒకసారి కలుసుకుని చర్చలు జరుపుతుంటారు.
ఐపీ అడ్రస్ ఆధారంగా జీతాల సర్దుబాటుపై చర్చ జరుగుతోంది.. ఇది భారత్ విషయంలో వర్తిస్తుందా? ఇది హేతుబద్ధమైనది, కానీ ఇప్పుడున్నది టాలెంట్ మార్కెట్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. పోటీలో ముందు ఉండటానికి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఆలోచిస్తారు. కంపెనీలు వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగులను నియమించడానికి ఒక కారణం ఉంది. ఇవి వ్యూహాత్మక ఎంపికలు. టాలెంట్ ఆధారంగా నడుస్తున్న ఈ మార్కెట్‌లో కంపెనీలు చేస్తున్న ఇలాంటి ఆలోచనలు(ఐపీ అడ్రస్ ఆధారంగా జీతాలు) పని చేస్తాయనుకోవడం లేదు. ఇతర కంపెనీలు మంచి శాలరీ ఆఫర్ చేస్తే.. అదే టాలెంట్‌ను ఉపయోగించి వేరొక చోట జాబ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
Also read:
Pregnancy Care: గర్భధారణ సమయంలో మహిళలకు ఎందుకు తలనొప్పి వస్తుంది?.. కారణాలు, నివారణ సూచనలు మీకోసం..
Drinking Water: నీరు తాగడం ఆరోగ్యానికి ప్రయోజనమే.. కానీ, ఈ టైమ్‌లో తాగితే మాత్రం అంతే సంగతులు..