Hero Electric Scooter: తక్కువ ధరల్లో హీరో నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్, ఇతర వివరాలు
Hero Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి..
Hero Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ ((Hero Electric) త్వరలోనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. హీరో (Hero) ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలోని ఆప్టిమా హెచ్‌ఎక్స్ సిరీస్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ 2022 హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ రెండు వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. CX, CX ER వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ వేరియంట్ సింగిల్ బ్యాటరీతో వస్తుండగా.. సీఎక్స్ ఈఆర్ డ్యూయల్ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్‌మునుపటి మోడల్ కంటే 25 శాతం ఎక్కువ శక్తివంతమైనదిగా అంచనా వేయబడింది.దాంతో పాటుగా ఎలక్ట్రిక్ మోటారు సామర్థ్యం మునుపటి కంటే 10 శాతం ఎక్కువగా ఉండనుంది. ఇవి ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. బ్యాటరీ ప్యాక్ 550W ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తాయి. పూర్తి ఛార్జింగ్ అయ్యేందుకు దాదాపు 4-5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్ల ధర రూ.60 వేల నుంచి రూ.70 మధ్య ఉండే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: