Success Story: వందేళ్లుగా ఆ రుచి మారలేదు.. దక్షిణ భారత దేశంలోనే టాప్ బ్రాండ్ ఇదే..

ఏదో ఒక బ్రాండ్ వచ్చి రాగానే ప్రజల్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తిగా మారిపోదు. అది ప్రజల్లోకి వెళ్లి, వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగితేనే ఏదైనా బ్రాండ్ సుస్థిరంగా నిలిచిపోతోంది. అలాంటి బ్రాండునే ఈ రోజుకు పరిచయం చేయబోతున్నాం. ఇది మన దక్షిణ భారత దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాల బ్రాండ్.

Success Story: వందేళ్లుగా ఆ రుచి మారలేదు.. దక్షిణ భారత దేశంలోనే టాప్ బ్రాండ్ ఇదే..
అవును.. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అప్పడంలో శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అప్పడంలో ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Aug 22, 2024 | 5:00 AM

సూర్య అంటే నేను కాదు.. అది ఒక బ్రాండ్.. ఇది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాలో చెప్పిన ఫేమస్ డైలాగ్. నిజమే బ్రాండ్ కు మనం అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంటాం. ఏ వస్తువు కావాలన్నా అది బ్రాండెడా కాదా అన్న విషయాన్ని ముందు తెలుసుకుంటాం. బ్రాండ్ నేమ్ ఉంటే చాలు దానిని ముందు వెనుక చూడకుండా కొనుగోలు చేసేస్తుంటాం. అది ఎంత కాస్ట్లీ అయినా బ్రాండ్ నేమ్ కు మనం తలొగ్గి చెల్లించేస్తుంటాం. అయితే అలాంటి బ్రాండ్ నేమ్ ప్రజల్లో రావడానికి కొన్నేళ్లు పడుతుంది. ఏదో ఒక బ్రాండ్ వచ్చి రాగానే ప్రజల్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తిగా మారిపోదు. అది ప్రజల్లోకి వెళ్లి, వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగితేనే ఏదైనా బ్రాండ్ సుస్థిరంగా నిలిచిపోతోంది. అలాంటి బ్రాండునే ఈ రోజుకు పరిచయం చేయబోతున్నాం. ఇది మన దక్షిణ భారత దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాల బ్రాండ్. ఎప్పుడో 1900లలో ఇంట్లోనే చిన్న అప్పడాల తయారీతో ప్రారంభమైన ఈ బిజినెస్.. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఇప్పుడు అప్పడాలు(పాపాడ్) విక్రయించే అతి పెద్ద కంపెనీగా అవతరించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న అప్పడాల కంపెనీ పేరు ఒకప్పటి మద్రాస్, నేటి చెన్నైకి చెందిన అంబికా అప్పలం. ఇది దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అప్పడాల కంపెనీ. ఈ కంపెనీ సక్సెస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా ప్రారంభం..

1915లో చెన్నైలోని ట్రిప్లికేన్ బై-లేన్‌లలో 850 చదరపు అడుగుల ఇంట్లో అయ్యప్పన్ అనే వ్యక్తి ఈ పాపడ్ బిజినెస్ ను ప్రారంభించారు. కేరళలోని త్రిచూర్ నుంచి ఉపాధి అవకాశాల కోసం మద్రాసుకు వలస వచ్చిన అయ్యప్పన్ అప్పడాలు అమ్మితే మంచి ఫలితాలు వస్తాయని ఆశించి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అతను చేతితో ఒత్తిన పాపడ్‌లను తయారు చేసి , వాటిని ఒక జనపనార తాడుతో కట్టి, ఇంటింటికీ వెళ్లి విక్రయించేవాడు. ఈ అప్పడాలు రుచిగా ఉండటం, తక్కువ ధరకు ఇంటికే వచ్చి అందిస్తుండటంతో క్రమంగా పాపులర్ అయ్యాయి. అయ్యప్పన్ పెళ్లి అయ్యాక కూడా తన కుటుంబంలోని సభ్యులంతా వీటిని తయారు చేసే పనిని ప్రారంభించి, ఉత్పత్తిని పెంచారు.

అంబికా అప్పలం డిపో పేరుతో..

అయ్యప్పన్ కొడుకు పుట్టాడు. అతని పేరు వేలాయుధన్. అయితే ఇతనికి చదువు అంతగా అబ్బలేదు. దీతో చదువు మానేసి తన తండ్రితో పాటే వ్యాపారంలో చేదేడోగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలో వీరు తయారు చేసిన అప్పడాలు త్వరగా పాడైపోతుండటంతో నష్టాలు వస్తున్న స్థితిని చూసిన వేలాయుధన్ ఒక సంవత్సరం వరకు లైఫ్ ఉండే ‘అప్పలం’ తయారు చేయాలని తలంచాడు. అయితే వారం వరకూ నిల్వ ఉండే అప్పడాలను తయారు చేశాడు. దాదాపు 40 సంవత్సరాలు అంటే 1915 నుంచి 1956 వరకూ ఈ అప్పడాలకు ఎలాంటి పేరు పెట్టలేదు. అంటే బ్రాండ్ నేమ్ ప్రజలకు నోటెడ్ కాలేదు. ఈ క్రమంలో వేలాయుధన్ అంబికా అప్పాలం డిపో అనే పేరును బిజినెస్ కు పెట్టాడు. ఓ స్థానిక కళాకారుడు ‘ అజగై పోరియం ‘ అనే ట్యాగ్‌లైన్‌తో లోగోను చిత్రించాడు. అంటే ‘అందంగా వేయించడం(fries beautifully)’.

అంతేకాకుండా తన ఉత్పత్తులు ఒక్కచోటే కాకుండా తాంబరం వరకు కూడా విస్తరించారు. దీన్ని మరింత పెద్దదిగా చేయాలనే కోరికతో, 1963లో, మైలాపూర్‌లోని మఠాల నారాయణన్ వీధిలో ఒక వ్యక్తి కూర్చోవడానికి సరిపోయే విధంగా చిన్న దుకాణాన్ని ప్రారంభించాడు. అసలు కథ ఇప్పుడు ప్రారంభమవుతుంది.

మరిన్ని ఉత్పత్తులు..

అంబికా అప్పలం బ్రాండ్ నేమ్ తో మరిన్ని ఉత్పత్తులను లాంచ్ చేయడం ప్రారంభించారు. 1965 నాటికి కంపెనీ అనేక ఉత్పత్తులను తమ జాబితాలో చేర్చడం ద్వారా వివిధ రకాలైన పోడులను ( రసం, పారుప్పు, సాంబార్, ఇడ్లీ ), వివిధ రకాల అప్పలాలు, పాపడమ్‌లతో పాటు అరసి (బియ్యం), జీలకర్ర (జీలకర్ర గింజలు ) వంటి వాటిని చేర్చింది.

మరో కొత్త అధ్యాయం..

1975లో 20 ఏళ్ల అయ్యప్పన్ మనవడు అంటే వేలాయుధన్ కొడుకు కేవీ విజయరాఘవన్ కూడా ఇదే వ్యాపారంలో చేరాడు. ఆ తర్వాత విజయ రాఘవన్ కుమారుడు వ్యాస్ కూడా ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నాడు. అంటే నాలుగు తరాలుగా ఒకటే బిజినెస్ లో వారు విజయవంతంగా దూసుకెళ్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి ఇది..

ప్రస్తుతం ఈ అంబికా అప్పలం బ్రాండ్ నేమ్ తో 55 రకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ ప్లాట్ ఫారంలో ఇవి దొరకుతాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో ఈ అంబికా అప్పలం ఉత్పత్తులు కొనుగోలో చేయొచ్చు. అలాగే ఈ కంపెనీ తన సొంత ఆన్ లైన్ పోర్టల్ ని కూడా త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..