AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF Scheme: రోజుకు కేవలం రూ. 416 పెట్టుబడితో.. కోటిన్నర సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

పీపీఎఫ్ ఖాతాపై ప్రభుత్వం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకొకసారి ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే ఈ పథకం ద్వారా కోటీశ్వరులు అవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు.

PPF Scheme: రోజుకు కేవలం రూ. 416 పెట్టుబడితో.. కోటిన్నర సంపాదించే అవకాశం..  పూర్తి వివరాలు తెలుసుకోండి..
Ppf Scheme
Madhu
|

Updated on: Mar 21, 2023 | 11:40 AM

Share

సురక్షిత పెట్టుబడి పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) . ఇది అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక పథకం. ఎందుకంటే దీనికి ప్రభుత్వం భరోసా ఉంటుంది. ఈ పీపీఎఫ్ ఖాతాను ఏదైనా బ్యాంకులో లేదా పోస్టాఫీసులో ప్రారంభించవచ్చు. 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా పీపీఎఫ్ లో ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టోచ్చు. ఖతా తెరవడానికి గరిష్ట వయో పరిమితి లేదు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాలి. ఉమ్మడి ఖాతా సౌకర్యం లేదు. దీనిపై 7.10శాతం వడ్డీ లభిస్తుంది. పైగా దీనిపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు ఒక వేళ కోటీశ్వరులు కావాలనుకొంటే ఈ పథకంలో ఖాతాను వెంటనే ప్రారంభించింది. కోటీశ్వరులు కావడం ఎలాగో మేము వివరిస్తాం..

రూ. 100 డిపాజిట్ చాలు..

పీపీఎఫ్ ఖాతాను ఏదైనా బ్యాంకులో గానీ లేదా పోస్టాఫీసులో గానీ రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా తెరవచ్చు. అయితే ఖాతా ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఏడాదికి రూ. 500 అయినా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒకసారి అయినా లేదా నెలకొకసారి చొప్పున 12 నెలలు కట్టుకోవచ్చు. ఈ పథకంలో చేరితే ఏడాదిలో డిపాజిట్ చేసే రూ. 1.50 లక్షలపై పన్ను ప్రయోజనాలు లభించడం సహా మెచ్యూరిటీ సమయంలో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు దీనిని పొడిగించుకోవచ్చు. ఇలా అపరిమిత కాలానికి ఈ స్కీమ్ ను పొడిగించుకోవచ్చు.

ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ జమ..

పీపీఎఫ్ ఖాతాపై ప్రభుత్వం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకొకసారి ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే కోటీశ్వరులు అవ్వచ్చునని నిపుణులు అంటున్నారు. అదెలా అంటే పీపీఎఫ్ మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత 3 దఫాలుగా 5 ఏళ్ళు చొప్పున పెంచుకోవచ్చు. అప్పుడు అదనంగా మరో 15 ఏళ్ళు పీరియడ్ ఉంటుంది. అంటే మొత్తం 30 ఏళ్ళు లాకిన్ పీరియడ్ పెట్టుకుంటే.. నెలకి ఇంత అని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మెచ్యూరిటీ సమయంలో కోటిన్నర పైనే పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఉదాహరణ చూడండి..

  • ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసున్నప్పుడు పీపీఎఫ్ ఖాతా తెరిచి డిపాజిట్ లేదా పెట్టుబడి పెట్టడం ప్రారంభించారనుకుందాం. లాకిన్ పీరియడ్ 15 ఏళ్ళు. నెలకు రూ. 12,500 చొప్పున ఏడాదికి రూ. 1.50 లక్షల పెట్టుబడి అవుతుంది. 15 ఏళ్ల మెచ్చూరిటీ పీరియడ్ పూర్తయ్యే నాటికి మీ మొత్తం నగదు రూ. 40,68,209 వస్తుంది.
  • దీనిని విత్ డ్రా చేయకుండా మరో 5 ఏళ్లకు పెంచుకుంటే.. మీరు ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 20 ఏళ్లు వరకూ ఉంచుకుంటే మీరు సొమ్ము మొత్తం రూ. 66,58,288 వస్తుంది.
  • ఇలా మూడు దఫాలు ఐదేళ్ల చొప్పున పీరియడ్ ని పొడిగించుకుంటూ వెళ్తే .. అప్పుడు మొత్తం పెట్టుబడి వ్యవధి 30 ఏళ్ళు. అప్పుడు మీ చేతికి రూ. 1,54,50,911 వస్తాయి. అంటే కోటిన్నర పైనే అన్నమాట. ఏడాదికి లక్షన్నర చొప్పున 30 ఏళ్లకు మీరు పెట్టిన పెట్టుబడి రూ. 45 లక్షలు. కానీ మీ చేతికి అదనంగా రూ. 1,09,50,911 వస్తాయి. అంటే వడ్డీ 7.1 శాతంతో ఏకంగా కోటి 9 లక్షల పైనే వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..