AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lambretta V125: స్టైలిష్ లుక్‪లో అదరగొడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా ఎస్1 ప్రో కన్నా మిన్నగా..

లాంబ్రెట్టా వీ125 ఎలక్ట్రిక్ స్కూటర్ ని మిలాన్ డిజైన్ వీక్ 2022లోనే ప్రదర్శించారు. దీనిలో 125సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10 హార్స్ పవర్ 9.2 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

Lambretta V125: స్టైలిష్ లుక్‪లో అదరగొడుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా ఎస్1 ప్రో కన్నా మిన్నగా..
Lambretta V125
Madhu
|

Updated on: Mar 28, 2023 | 5:30 PM

Share

ఆటోమొబైల్ రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మార్కెట్లో సంప్రదాయ ఇంధన వాహనాల స్థానాన్ని విద్యుత్ శ్రేణి వాహనాలు వేగంగా ఆక్రమించేస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహనాల కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ ఉత్పత్తులను విద్యుత్ శ్రేణిలో లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో లాంబ్రెట్టా స్కూటర్స్ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆవిష్కరించింది. దీని పేరు లాంబ్రెట్టా వీ 125(Lambretta V125). దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్లు.. లాంబ్రెట్టా వీ125 ఎలక్ట్రిక్ స్కూటర్ ని మిలాన్ డిజైన్ వీక్ 2022లోనే ప్రదర్శించారు. దీనిలో 125సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10 హార్స్ పవర్ 9.2 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉంటాయి. 12 వోల్ట్స్ చార్జర్ ఉంటుంది. మొత్తం మీది ఇది వెస్పా ఎల్ ఎక్స్ 125 స్కూటర్ కు పోటీగా అంతకు మించిన ఫీచర్లు, పనితీరుతో వినియోగదారులను అలరించనుంది.

ఫీచర్లు.. ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ ప్యానల్ ఉంది. ఎల్ఈడీ లైటింగ్ హెడ్ ల్యాంప్, సిగ్నల్ లైట్లు కూడా ఎల్ఈడీనే ఉంటాయి. డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. లగేజీ స్టోరేజీ రెండు ప్రాంతాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మార్కెట్లోకి ఎప్పుడంటే.. లాంబ్రెట్టా వీ 125 ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 జూన్ లో ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. దీని ధరకు సంబంధిన వివరాలు ఇంకా తెలియలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Follow Us