Stock Market: పంట పండిందిగా.. రూ. 10వేల పెట్టుబడితో ఆరు నెలల్లో రూ. 2లక్షలు రాబడి.. ఇది కదా షేర్ మార్కెట్ సత్తా..

ఎక్కువ శాతం మంది చిన్న షేర్లపై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. చిన్న షేర్లు లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉన్న వారికి ఇది అర్థం అవుతుంది. అటువంటి ఓ చిన్న షేర్ ఇప్పుడు భారీ లాభాలు ఆర్జించి పెట్టింది. ఎంత లాభం అంటే ఏకంగా 2000శాతం లాభాన్ని అందించింది. అంటే మీరు రూ. 10వేలు పెట్టి షేర్లు కొంటే.. ఏకంగా రూ. 2.1లక్షలు తెచ్చిపెట్టింది.

Stock Market: పంట పండిందిగా.. రూ. 10వేల పెట్టుబడితో ఆరు నెలల్లో రూ. 2లక్షలు రాబడి.. ఇది కదా షేర్ మార్కెట్ సత్తా..
Stock Markets
Follow us

|

Updated on: Sep 18, 2023 | 5:40 PM

షేర్ మార్కెట్.. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనుకొనే వారికి బెస్ట్ ఆప్షన్. ఎంత మంచి రాబడి ఉంటుందో అంతే స్థాయిలో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అందుకే సామాన్యులు అటువైపు చూడరు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువ మంది షేర్, స్టాక్ మార్కెట్ల వైపు చూస్తున్నారు. దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది చిన్న షేర్లపై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. చిన్న షేర్లు లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉన్న వారికి ఇది అర్థం అవుతుంది. అటువంటి ఓ చిన్న షేర్ ఇప్పుడు భారీ లాభాలు ఆర్జించి పెట్టింది. ఎంత లాభం అంటే ఏకంగా 2000శాతం లాభాన్ని అందించింది. అంటే మీరు రూ. 10వేలు పెట్టి షేర్లు కొంటే.. ఏకంగా రూ. 2.1లక్షలు తెచ్చిపెట్టింది. మైక్రో క్యాప్ కేటగిరి కింద అండర్‌వాల్యూడ్ గా ఉన్న ఈ స్టాక్ షేర్లు కేవలం ఆరు నెలల వ్యవధిలో దాదాపు 2,000 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందజేసింది. ఈ స్టాక్ పేరు ఏంటి? దాని ప్రస్తుత పరిస్థితి ఏంటి? తెలుసుకుందా రండి..

ఇవి స్టాక్ వివరాలు..

ఈ స్టాక్ పేరు ప్రైమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (పీఐఎల్). ఇది వనస్పతి తయారీతో పాటు మార్కెటింగ్ వ్యాపారం కూడా చేస్తుంది. ఈ కంపెనీ ఇటీవల బేకరీ క్వాలిటీ వనస్పతి తయారీని కూడా ప్రారంభించింది. అంటే నాణ్యమైన శుద్ధి చేసిన వంటనూనెను తయారు చేస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి కొన్ని రకాల నూనెలను ప్రాసెసింగ్ చేస్తుంది. ఈ కంపెనీకి చెందిన షేర్లు రూ. 230 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో గత శుక్రవారం ఆల్ టైమ్ హై ధర రూ.146.40 వద్ద ముగిసింది. కంపెనీ ప్రైస్-టు-ఎర్నింగ్స్ (P/E) నిష్పత్తి 17.83గా నివేదించబడింది, ఇది ఇండస్ట్రీ P/E నిష్పత్తి 22 కంటే తక్కువ. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, కంపెనీ స్టాక్ మార్చి 2023లో రూ. 7 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 146.40 కు చేరుకుంది. అంటే కేవలం ఆరు నెలల వ్యవధిలో దాదాపు 2,000 శాతం మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అదే అంటే ఎవరైనా స్టాక్‌లో రూ.10 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ ఆరు నెలల వ్యవధిలో అది దాదాపు రూ.2.10 లక్షల ఆదాయం సమకూరింది. ఈ కంపెనీ షేర్లు ఇప్పటికీ కూడా కంటిన్యూగా పాజిటివ్‌ ట్రేడ్‌తో ఉంది.

లాభాలు పెరిగాయి..

ఈ సంస్థ తాజా త్రైమాసిక ఆర్థిక నివేదికల ప్రకారం .. నిర్వహణ రాబడి , నికర లాభాలు వంటి ప్రాథమిక వ్యాపార పారామితులలో పెరుగుదలను చూపిస్తున్నాయి 2022-23 ఆర్థిక సంవత్సరం నాల్గో క్వార్టర్లో కంపెనీ ఆదాయం రూ. 5.53 కోట్లు ఉండగా.. 2023-24 ఆర్థిక సంవత్సంర మొదటి క్వార్టర్ కు అది రూ. 11.43కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభాలు రూ. 82లక్షల నుంచి రూ. 11.20కోట్లకు చేరుకుంది. అదే విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభదాయక నిష్పత్తులను నివేదించింది. ఈక్విటీపై రాబడి(ఆర్ఓఈ) 7.63శాతం, మూలధనంపై రాబడి(ఆర్ఓసీఈ) 6.63శాతంగా నివేదించింది. కంపెనీ డెట్-టు-ఈక్విటీ నిష్పత్తి, ఇప్పటికే కావలసిన స్థాయిల కంటే తక్కువగానే ఉంది, 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు 0.48 రెట్లు సానుకూల మార్పును చూపుతూ ఆర్థిక సంవ్సతరం 2022-23 సమయంలో 0.13 రెట్లు తగ్గింది. జూన్ 2023 త్రైమాసికానికి అందుబాటులో ఉన్న తాజా షేర్‌హోల్డింగ్ డేటా 56.38 శాతం వాటాను కలిగి ఉండటం ద్వారా ప్రమోటర్ కు చెందిన ‘స్కిన్ ఇన్ ది గేమ్’ని సూచిస్తుంది, దాని తర్వాత రిటైల్ పెట్టుబడిదారులు కంపెనీలో 43.59 శాతం వాటాను కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
ధాబా స్టైల్‌లో ఎగ్ భుర్జీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు..
హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు.. ఇదొక్కటి చేయండి చాలు..
హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు.. ఇదొక్కటి చేయండి చాలు..
ఇలా కనిపిస్తే డయాబెటిస్ లక్షణాలే.. వెంటనే అలర్టవ్వండి
ఇలా కనిపిస్తే డయాబెటిస్ లక్షణాలే.. వెంటనే అలర్టవ్వండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు