Income Tax: ‘హెచ్‌యూఎఫ్’ అంటే ఏమిటి? దీని ద్వారా పన్ను మినహాయింపులు ఎలా ఉంటాయి?

పన్ను ఆదా చేయడానికి మరొక మార్గం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం చాలా మందికి ఉపయోగపడేలా ఉంది. అది ఏంటంటే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్). దీని ద్వారా వివాహిత హిందువులు తమ పన్ను ఆదాను చేసుకోవచ్చు. హిందువులతో పాటు బౌద్ధ, సిక్కు, జైన కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Income Tax: ‘హెచ్‌యూఎఫ్’ అంటే ఏమిటి? దీని ద్వారా పన్ను మినహాయింపులు ఎలా ఉంటాయి?
Income Tax
Follow us

|

Updated on: Apr 01, 2024 | 11:45 AM

సాధారణంగా పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇస్తుంది. కొన్ని రకాల పెట్టుబడులకు సెక్షన్ 80 సీ ప్రకారం తగ్గింపు వర్తిస్తుంది. వీటిని సంప్రదాయక పన్ను ఆదా పెట్టుబడులని చెప్పవచ్చు. ఇవి దాదాపు అందరికీ తెలుసు. అయితే పన్ను ఆదా చేయడానికి మరొక మార్గం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం చాలా మందికి ఉపయోగపడేలా ఉంది. అది ఏంటంటే హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్). దీని ద్వారా వివాహిత హిందువులు తమ పన్ను ఆదాను చేసుకోవచ్చు. హిందువులతో పాటు బౌద్ధ, సిక్కు, జైన కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

అవిభాజ్య కుటుంబం (హెచ్ యూఎఫ్)..

మీరు హిందువులు, వివాహితులై ఉంటే పన్నులను ఆదా చేసుకోవడానికి హెచ్ యూఎఫ్ ను ఉపయోగించవచ్చు. హెచ్ యూఎఫ్ అనేది ఒక ప్రత్యేక సంస్థగా పరిగణించబడుతుంది. వ్యక్తిగత తగ్గింపులతో పాటు దీనికి విడిగా తగ్గింపులు వర్తిస్తాయి. దీనికోసం ముందుగా ఆస్తి నుంచి అద్దె ఆదాయాన్ని హెచ్ యూఎఫ్ కు బదిలీ చేయాలి. అందుకోసం హెచ్ యూఎఫ్ పేరుతో డీమ్యాట్ ఖాతా తెరవాలి. దానికి డబ్బులు బదిలీ చేయడం, బహుమతులు స్వీకరించడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

ఆర్థిక ప్రయోజనాలు..

హెచ్ యూఎఫ్ అనేది పన్ను ఆదా చేసే వ్యూహం మాత్రమే కాదు. దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆర్థిక స్థితిని నియంత్రించవచ్చు. హిందూ అవిభక్త కుటుంబం అనేది పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. భార్యలు, అవివాహిత కుమార్తెలతో సహా వారసులతో కూడిన ఒక వ్యక్తి కుటుంబం. హెచ్ యూఎఫ్ ను ప్రత్యేక చట్టపరమైన సంస్థగా గుర్తించారు. అందుకే దానికి పన్ను మినిహాయింపులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

నిబంధనలు..

హిందూ అవిభక్త కుటుంబంలో యజమానిని కర్త గా సంబోంధిస్తారు. కుటుంబానికి నాయకత్వం వహిస్తాడు. ఇతర సభ్యులు ఈయనకు సహాయంగా ఉంటారు. భార్య ఒక సభ్యురాలుగా పరిగణించబడుతుంది. వీరితో పాటు ఇద్దరు కోపార్సెనర్స్ (వారసులు) కలిగి ఉండాలి.

పన్ను తగ్గింపు..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54B, 54D, 54EC, 54F, 54G ప్రకారం హెచ్ యూఎఫ్ ద్వారా పన్ను తగ్గింపునుకు క్లెయిమ్ చేయవచ్చు. దీనికోసం ప్రత్యేక పాన్ కార్డు పొందాలి. హిందువులతో పాటు బౌద్ధ, సిక్కు, జైన కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను పలువురు ఆర్థిక నిపుణులు కూడా తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లో పంచుకుంటున్నారు. హెచ్ యూఎఫ్ పై పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్