Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payment: పిన్ లేకుండానే పేమెంట్ చేసేయొచ్చు.. బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా ఇబ్బంది లేదు.. వివరాలు..

పిన్ అవసరం లేకుండా.. బ్యాంక్ సర్వర్లతో పని లేకుండా యూపీఐ పేమెంట్ చేయగలిగే ఓ కొత్త ఫీచర్ ను మొబిక్విక్ ఆవిష్కరించింది. మొబిక్విక్ వ్యాలెట్ యూపీఐ పేరిట ఈ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వేగంగా, సులభంగా పేమెంట్ పేర్తి చేయచ్చని కంపెనీ ప్రకటించింది.

UPI Payment: పిన్ లేకుండానే పేమెంట్ చేసేయొచ్చు.. బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా ఇబ్బంది లేదు.. వివరాలు..
Upi Payments
Follow us
Madhu

|

Updated on: May 25, 2023 | 3:30 PM

ఇటీవల కాలంలో యూపీఐ పేమెంట్లు అధికమయ్యాయి. చిన్న చిన్న బడ్డీ కొట్లు నుంచి పెద్ద పెద్ద హోటల్స్ వరకూ అన్నింట్లోనూ యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉంటుండంతో అందరూ వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ పేమెంట్లు చేసేటప్పుడు ఒక్కోసారి బ్యాంకు సర్వర్లు డౌన్ అవుతుంటాయి. అలాంటి సందర్భంలో పేమెంట్ పూర్తి కాదు. డబ్బులు మాత్రం మన దగ్గర కట్ అయిపోతాయి. అవతలి వారికి వెళ్లవు. అప్పుడు బాగా టెన్షన్ పడిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో మనం పిన్ మర్చిపోతుంటాం. అప్పుడు కూడా పేమెంట్లు చేయడం ఇబ్బంది అవతుంది. అలాంటి టెన్షన్ లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. యూపీఐ పేమెంట్ కు పిన్ అవసరం లేకుండా.. బ్యాంక్ సర్వర్లతో పని లేకుండా చేయగలిగే ఓ కొత్త ఫీచర్ ను మొబిక్విక్ ఆవిష్కరించింది. మొబిక్విక్ వ్యాలెట్ యూపీఐ పేరిట ఈ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వేగంగా, సులభంగా పేమెంట్ పేర్తి చేయచ్చని కంపెనీ ప్రకటించింది. దీనికోసం యూపీఐ పిన్ గానీ, బ్యాంక్ సర్వర్ తో గానీ పనిలేదని పేర్కొంది. అలాగే చిన్న చిన్నపేమెంట్లు కూడా బ్యాంకు స్టేట్ మెంట్లో లేకుండా చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మొబిక్విక్ వ్యాలెట్ యూపీఐ..

ఈ మొబిక్విక్ వ్యాలెట్ యూపీఐలో మీరు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ బ్యాలెన్స్ వేసి వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ని యాక్టివేట్ చేసుకోడానికి మొదటిగా వ్యాలెట్ లోకి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా బ్యాంకు ద్వారా డబ్బులను బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొబిక్విక్ వ్యాలెట్ యూపీఐ దేశంలోని అన్ని బ్యాంకులను సపోర్టు చేస్తుంది. విసా, మాస్టర్ కార్డ్, డైనర్స్, అమెక్స్, రూపే వంటి క్రెడిట్ కార్డు నెట్ వర్క్స్ ని కూడా సపోర్టు చేస్తుంది.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

ఇప్పటికే మొబిక్విక్ వ్యాలెట్ వినియోగిస్తున్న వినియోగదారులు ఆటోమేటిక్ గా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. దీనిని ప్రారంభించడానికి కచ్చితంగా యూనిక్ వ్యాలెట్ యూపీఐ ఐడీని తయారు చేసుకోవాల్స ఉంటుంది. ఒక్కసారి ఈ వ్యాలెట్ యాక్టివేట్ చేసుకుంటే.. వినియోగదారులు వ్యాపారుల వద్ద మొబిక్విక్ యాప్ నుంచి ఎంచక్కా స్కాన్ చేసి పేమెంట్ చేసేయొచ్చు.

ఇవి కూడా చదవండి

ఫీజులు ఇలా..

ఈ వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేసేందుకు రూ. 2000లోపు లావాదేవీలకు ఎటువంటి ఫీజులు ఉండవు. అయితే ఆపైన చేసే లావాదేవీలపై మాత్రం 1.1 శాతం ఎండీఆర్ ను వ్యాపారుల నుంచి తీసుకుంటారు. అయతే వ్యాపారుల అప్పటికే ఎండీఆర్ చెల్లించి ఉంటారు కాబట్టి వారిపై పెద్దగా అది భారం కాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..