AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO: ఐపీవోల కోసం ఎదురు చూస్తున్నారా..? వాటిపై అవగాహన మస్ట్..!

ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్, దానిలో పెట్టుబడులపై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. తక్కువ సమయంలో అధిక ఆదాయం సంపాదించడానికి వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఆసక్తి చూపేవారు. ఇప్పుడు వాటితో పాటు స్టాక్ మార్కెట్ లో పెట్డుబడులు ఎక్కువగా పెడుతున్నారు. దీనిలో కొంచెం ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ధీర్ఘకాలంలో అత్యధిక రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.

IPO: ఐపీవోల కోసం ఎదురు చూస్తున్నారా..? వాటిపై అవగాహన మస్ట్..!
ipo
Nikhil
|

Updated on: May 28, 2025 | 4:30 PM

Share

స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) గురించి తెలిసే ఉంటుంది. దీని ద్వారా ఒక కంపెనీ తన వాటాలను ప్రజలకు విక్రయిస్తుంది. ఇలా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వినియోగించుకుంటుంది. వీటిని ఎస్ఎంఈ, మెయిన్ బోర్డు అనే రెండు రకాల ఐపీవోలుగా విభజించారు. వాటి మధ్య తేడాలు, ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న, మధ్య తరహా సంస్థలు విడుదల చేసే పబ్లిక్ ఇష్యూలను ఎస్ఎంఈ ఐపీవోలు అంటారు. తక్కువ మూలధనం, పరిమిత వ్యాపార చరిత్ర కలిగి ఉంటాయి. వీటిని ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ అనే ప్రత్యేక ప్లాట్ ఫాంలో జాబితా చేస్తారు. మెయిన్ బోర్డు ఐపీవోలను పెద్ద కంపెనీలు, బాగా స్థిర పడిన సంస్థలు విడుదల చేస్తాయి. వీటిని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లలో జాబితా చేస్తారు.

ఎస్ఎంఈ

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక రిస్కు, ధీర్థకాలిక ప్రణాళిక ఉన్నవారు ఎస్ఎంఈల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. వీటి వల్ల కొంచెం రిస్కు ఉన్నప్పటికీ వ్యాపారం విజయవంతంగా సాగితే అధిక రాబడి అందిస్తాయి. అయితే కంపెనీకి సంబంధించిన కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కంపెనీ ప్రాథమిక అంశాలు, ప్రమోటర్ ట్రాక్ రికార్డు, వ్యాపార స్కేలబిలిటీని గమనించాలి. అలాగే ఇంటర్నెట్ లో కనిపించే జీఎంపీ సంఖ్యలను గుడ్డిగా నమ్మవద్దు. కానీ ఎస్ఎంఈ ఐపీవో పొందాలంటే అధిక మూలధనం అవసరమవుతుంది. సుమారు రూ.ఒక లక్ష నుంచి రెండు లక్షలు చేతిలో ఉంచుకోవాలి.

మెయిన్ బోర్డు

మెయిన్ బోర్డు ఐపీవోలు పెట్టుబడి దారులకు చాాలా అనుకూలంగా ఉంటాయి. వీటిని పెద్ద కంపెనీలు విడుదల చేస్తాయి కాబట్టి నమ్మకంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైల్ పెట్టుబడిదారులు, సంస్థాగత పెట్టుబడిదారులు, సంప్రదాయ పెట్టుబడిదారులకు బాగుంటాయి. సుమారు రూ.15 వేలతో వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పెద్ద కంపెనీలు కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం దాదాపు ఉండదు.

ఇవి కూడా చదవండి

లాభనష్టాలు

  • ఎస్ఎంఈ ఐపీవోలకు మార్కెట్ పోటీ తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఆకర్షణీయమైన విలువల్లో లభిస్తాయి. ప్రాథమిక స్థాయిలోనే కంపెనీలో ప్రవేశించవచ్చు. అయితే తక్కువ ద్రవ్యత, అధిక ప్రమాదం, పరిమిత ప్రజా సమాచారం తదితర ప్రతికూలతలు ఉన్నాయి.
  • మెయిన్ బోర్డు ఐపీవోలను కొనడం, అమ్మడం చాలా సులభం. లిస్టింగ్ తర్వాత మెరుగైన లిక్విడిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు నియంత్రణ, తనిఖీలు జరుగుతాయి. అయితే వీటి విలువలు ఎక్కువగా ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి