Mudra Loan: ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. 10లక్షల వరకూ రుణం.. సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి వరం..
దేశ వ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఈ పథకాన్ని ఇప్పటికీ ఈ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో చాలా మందికి తెలీదు. మీరు ఒకవేళ ఎదైనా చిన్న బిజినెస్ ప్రారంభించే ఆలోచనలో ఉంటే.. దానికి పెట్టుబడి మీ దగ్గర లేకపోతే.. ఈ ముద్ర యోజన బాగా ఉపయోగపడుతుంది. ఈ లోన్ అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకుందా రండి..
ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కాదు.. మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి.. ఇదే ఇటీవల యువత నుంచి ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది. ముఖ్యంగా మన దేశ యువతలో ప్రతిభకు కొదువులేదనేది అందరూ ఒప్పుకుంటున్న సత్యం. అయితే వారికి కావాల్సిందల్లా సరైన ప్రోత్సాహమే. దానిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు యువత ప్రారంభించేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. బిజినెస్ ప్రారంభించేందుకు అవసరమైన ప్రారంభ నిధిని పలు లోన్ల రూపంలో అందిస్తోంది. అలాంటి వాటిల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) ఒకటి. వ్యవసాయేతర రంగాల్లో రాణించాలి అభిషలించే వారికి రుణాలిచ్చి ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా లక్షల కోట మేరు రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ఔత్సాహికులు దీని ద్వారా లబ్ధిపొందారు. దేశ వ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఈ పథకాన్ని ఇప్పటికీ ఈ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో చాలా మందికి తెలీదు. మీరు ఒకవేళ ఎదైనా చిన్న బిజినెస్ ప్రారంభించే ఆలోచనలో ఉంటే.. దానికి పెట్టుబడి మీ దగ్గర లేకపోతే.. ఈ ముద్ర యోజన బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర లోన్ కు అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తెలుసుకుందా రండి..
రూ. 10లక్షల వరకూ రుణం..
ప్రధాన మంత్రి ముద్ర యోజనను 2015, ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. తయారీరంగం, ట్రేడింగ్, సర్వీసెస్ వంటి అనేక రంగాల్లో భారతదేశ పౌరులు ఎవరైనా దీనిలో రుణం పొందొచ్చు. ఎటువంటి ష్యూరిటీ, తనఖా అవసరం లేకుండా రూ. 10లక్షల వరకూ రుణం మంజూరు చేస్తారు.
కొత్త వారికి కూడా..
మీరు ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించాలనుకుంటే.. అందుకు తగిన పెట్టుబడి నిధి మీ వద్ద లేకుంటే మీరు ఈ ముద్ర యోజన స్కీమ్ ను వినియోగించుకోవచ్చు. అలాగే ఇప్పటికే మీరు ఏదైనా చిరు వ్యాపారం చేస్తున్నట్లు అయితే దానిని విస్తరించేందుకు కూడా ఈ పథకం ఉపయోగపడతుంది. దీనిలో ఎటువంటి ష్యూరిటీ అవసరం లేదు. అలాగే ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
ముద్ర రుణాల్లో రకాలు..
పీఎం ముద్ర యోజనలో మూడు రకాల రుణాలు పొందుకొవచ్చు. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విధాలుగా రుణాలిస్తారు. శిశు రుణాలు అంటే రూ. 50వేలు, కిశోర్ లోన్ అంటే రూ. 50,001 నుంచి రూ. 5లక్షల వరకూ, తరుణ్ లోన్ అంటే రూ. 5,00,001 నుంచి రూ. 10లక్షల వరకూ రుణం తీసుకొవచ్చు. వ్యక్తులు వారి అవసరాన్ని వీటిల్లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.
ఎవరిస్తారు..
ఈ ముద్ర రుణాలను బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు అందిస్తాయి. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, కోఆపరేటివ్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా వీటిని అందిస్తాయి. మీరు దీనికి దరఖాస్తు చేసుకుంటే.. ఎంత మొత్తం కావాలని మీరు దరఖాస్తు చేసుకున్నారో దానిలో 10శాతం మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 90శాతం రుణంగా మంజూరు చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి..
పీఎం ముద్ర లోన్ కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://www.udyamimitra.in/ వెబ్ సైట్లో కి వెళ్లి, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇతర బిజినెస్ పత్రాలు(బ్యాంక్ స్టేట్ మెంట్, ఐటీఆర్, పాన్ కార్డు వంటివి) బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..