AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: సిబిల్ స్కోర్ బాగున్నా లోన్ రావడం లేదా? కారణమిదే.. వివరాలు తెలుసుకోండి..

మంజూరు చేసేందుకు బ్యాంకర్లు మొదటిగా తనిఖీ చేసేది రుణ గ్రహీతల సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్. ఇది సక్రమంగా ఉంటేనే లోన్ సులభంగా మంజూరువుతుంది. చాలా మందికి ఇదొక్కటే పరిశీలిస్తారని అనుకుంటారు. అయితే కొంతమందికి సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా.. లోన్ బ్యాంకర్లు లోన్ మంజూరు చేయరు. దానికి కారణం చాలా మందికి అర్థం కాదు. వాస్తవానికి సిబిల్ స్కోర్ ఒక్కదాన్ని బట్టే బ్యాంకర్లు పర్సనల్ లోన్లు మంజూరు కావు.. మరో మూడు అంశాలను కూడా రుణదాతలు పరిశీలిస్తారు. ఏమిటవి?

Personal Loan: సిబిల్ స్కోర్ బాగున్నా లోన్ రావడం లేదా? కారణమిదే.. వివరాలు తెలుసుకోండి..
Personal Loan
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 17, 2023 | 4:00 PM

Share

పర్సనల్ లోన్.. అత్యవసర సమయాల్లో ఎటువంటి పత్రాలు లేకుండా వేగంగా మంజూరయ్యే లోన్ ఇది. మెడికల్ ఎమర్జెన్సీ లేదా మరైదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇది మీకు బాగా ఉపకరిస్తుంది. దీనిని మంజూరు చేసేందుకు బ్యాంకర్లు మొదటిగా తనిఖీ చేసేది రుణ గ్రహీతల సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్. ఇది సక్రమంగా ఉంటేనే లోన్ సులభంగా మంజూరువుతుంది. చాలా మందికి ఇదొక్కటే పరిశీలిస్తారని అనుకుంటారు. అయితే కొంతమందికి సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా.. లోన్ బ్యాంకర్లు లోన్ మంజూరు చేయరు. దానికి కారణం చాలా మందికి అర్థం కాదు. వాస్తవానికి సిబిల్ స్కోర్ ఒక్కదాన్ని బట్టే బ్యాంకర్లు పర్సనల్ లోన్లు మంజూరు చేస్తాయని మనం అనుకుంటాం.. కానీ మరో మూడు అంశాలను కూడా రుణదాతలు పరిశీలిస్తాయి. ఏమిటవి? లోన్ల మంజూరులో వాటికి ఎందుకు అంత ప్రాముఖ్యత తెలుసుకుందాం రండి..

డెట్ టు ఇన్కమ్ (డీటీఐ) నిష్పత్తి..

ఎవరికైనా రుణం ఇచ్చే ముందు, బ్యాంకు కచ్చితంగా అప్పు-ఆదాయ నిష్పత్తి(డెట్-ఇన్కమ్ రేషియో)ని తనిఖీ చేస్తుంది. ఈ నిష్పత్తి నెలవారీ రుణ చెల్లింపును మీ స్థూల జీతంతో పోల్చడం ద్వారా లెక్కిస్తారు. డీటీఐ నిష్పత్తి తక్కువగా ఉంటే, మీకు రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నిష్పత్తి ద్వారా, మీకు ఇప్పటికే ఎన్ని రుణాలు ఉన్నాయి. మీ చేతిలో ఎంత డబ్బు మిగిలి ఉందో బ్యాంకు అర్థం చేసుకుంటుంది.

ఈఎంఐ/ఎన్ఎంఐ నిష్పత్తి..

ఈ రేషియో ద్వారా, ప్రతిపాదిత రుణం ప్రస్తుత ఈఎంఐ కోసం మీ నికర నెలవారీ ఆదాయంలో ఎంత భాగం ఖర్చు చేయబడుతుందో బ్యాంక్ లెక్కిస్తుంది. మీ ఈఎంఐ/ఎన్ఎంఐ అనేది 50-55 శాతం వరకు ఉంటే, అది మంచిదని అర్థం. కానీ నిష్పత్తి అంతకంటే ఎక్కువ ఉంటే, బ్యాంకులు మీకు రుణం ఇవ్వడానికి ఆలోచిస్తాయి. అయినప్పటికీ, బ్యాంకులు మీకు రుణం ఇస్తే, వారు తరచుగా అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

లోన్-టు-వాల్యూ రేషియో (ఎల్టీవీ)..

నిష్పత్తి ముఖ్యంగా హౌసింగ్ లోన్ విషయంలో లెక్కిస్తారు. ఈ నిష్పత్తి సహాయంతో ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. మీ ఆస్తి లేదా కొలేటరల్‌తో పోలిస్తే మీ లోన్ విలువ ఎంత ఉందో ఎల్టీవీ నిష్పత్తి చూపిస్తుంది. ఇది రుణాన్ని పొందడంలో సహాయపడుతుంది. అవసరమైన నిబంధనలు, షరతులను రూపొందించడానికి రుణం ఇచ్చే బ్యాంకు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

సిబిల్ స్కోర్‌ను కూడా అవసరమే..

ప్రధానంగా లోన్లు సులభంగా కావాలంటే ప్రధానంగా ఉండాల్సినది సిబిల్ స్కోర్. ఇది మూడు అంకెల సంఖ్య. దీని పరిధి 300 నుంచి 900 మార్కుల వరకు ఉంటుంది. ఇది రుణం తీసుకోవడానికి మీ అర్హతను చూపుతుంది. మీ పాత రుణాలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు మొదలైన వాటి ఆధారంగా ఈ సంఖ్య లెక్కిస్తారు. మీరు మీ అన్ని రుణాలు, కార్డ్ బిల్లులను తిరిగి చెల్లిస్తూ ఉంటే, మీ సిబిల్ స్కోర్ మెరుగవుతుంది, అయితే మీరు ఏదైనా డిఫాల్ట్ చేస్తే, మీ సిబిల్ స్కోర్ మరింత దిగజారుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..