Renault 5 Electric Car: సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. టాటా, ఎంజీ కంపెనీలకు పోటీగా.. లాంచింగ్ ఎప్పుడంటే..
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రెనాల్ట్ కూడా యూరోపియన్ మార్కెట్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. థర్డ్ జెన్ రెనాల్ట్ 5 పేరుతో దీనిని తీసుకురానుంది. దీనికి సంబంధించిన టీజర్ ను కూడా ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ విడుదల చేసింది. కాగా 2024, ఫిబ్రవరీ 26వ తేదీన గ్లోబల్ వైడ్ గా దీనిని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్ల చేసుకుందా. అయితే ఈ కారు ఎక్స్ టీరియర్ డిజైన్ కు సంబంధించిన పేటెంట్ చిత్రాలు లీక్ అయ్యాయి.
గ్లోబల్ వైడ్ మంచి మార్కెట్ ఉన్న రెనాల్ట్ నుంచి తొలి ఎలక్ట్రిక్ వాహనం త్వరలో లాంచ్ కానుంది. ఇటీవలే రెనాల్ట్ డస్టర్ కారును గ్లోబల్ వైడ్ గా లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్లో కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2024 తొలి నాళ్లలోనే దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది. దీని పేరు థర్డ్ జెన్ రెనాల్ట్ 5. అయితే అధికారిక లాంచ్ కు ముందే ఈ కారు డిజైన్ చిత్రాలను లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్ లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. దీని లుక్ ప్రకారం చూస్తే ఈ కారు టాటా టైగోర్, ఎంపీ కామెట్ కార్లకు పోటీగా దీనిని తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రెనాల్ట్ కూడా యూరోపియన్ మార్కెట్లో ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. థర్డ్ జెన్ రెనాల్ట్ 5 పేరుతో దీనిని తీసుకురానుంది. దీనికి సంబంధించిన టీజర్ ను కూడా ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ విడుదల చేసింది. కాగా 2024, ఫిబ్రవరీ 26వ తేదీన గ్లోబల్ వైడ్ గా దీనిని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్ల చేసుకుందా. అయితే ఈ కారు ఎక్స్ టీరియర్ డిజైన్ కు సంబంధించిన పేటెంట్ చిత్రాలు లీక్ అయ్యాయి.
డిజైన్ ఇలా..
ఇటీవల విడుదలైన చిత్రాల ప్రకారం ఇది 2021 కాన్సెప్ట్ కు దగ్గరగా ఉంది. హెడ్ లైట్లు గుడ్రంగా ఎల్ఈడీ ప్రొజెక్టర్లతో ఉంది. బానెట్ పై వైవిధ్యమైన చార్జ్ ఇండికేటర్ ఉంటుంది. దీనిలో బ్యాటరీ చార్జ్ స్థాయిలు కనిపిస్తాయి. వెనుకవైపు బ్రేక్ లైట్లు కూడా కొన్ని అడ్జస్ట్ మెంట్లు చేశారు. వెనకాల బ్లాక్ రిమ్ ఎక్కువ వెడల్పు ఉన్న లైట్ బార్ ను ఏర్పాటు చేశారు. ఇది ఏఎంపీఆర్ స్మార్ట్ ప్లాట్ ఫారం ఆధారంగా తయారు చేశారు.
రెనాల్ట్ 5 స్పెసిషికేషన్స్..
ఈ కారుకు సంబంధించిన టీజర్ కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. దీనిలో 52కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 400కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఏఎంపీఆర్ స్మాల్ ప్లాట్ ఫారం సాయంతో హ్యాండ్లింగ్, మల్టీ లింక్ యాగ్జిల్ ఉంటాయి. మంచిసస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. 135హెచ్పీ మోటార్ ఉంటుంది. ఇది రెనాల్ట్ క్లియోన్ ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు.
రెనాల్ట్ 5 మన దేశంలో ఎప్పుడు..
ఈ రెనాల్ట్ 5 ఎలక్ట్రిక్ కారు యూరోపియన్ దేశాలతో పాటు గ్లోబల్ వైడ్ గా 2024, ఫిబ్రవరీలో లాంచ్ అవుతోంది. కాగా మన దేశంలో ఎప్పుడు విడుదల అవుతోందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే రెనాల్ట్ న్యూ డస్టర్ ఎస్యూవీ కారు మన దేశీయ మార్కెట్లో 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..