Home Loan: హోమ్ లోన్ లాభదాయకంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. టెన్యూర్, ఈఎంఐల పైనే ఫోకస్..

|

Jul 04, 2023 | 5:00 PM

చాలా మంది హోమ్ లోన్ టెన్యూర్ ఎంత పెట్టుకోవాలి అనే విషయంలో కాస్త గందరగోళానికి గురవుతారు. ఎక్కువ శాతం మంది అధిక టెన్యూర్ పెట్టుకుంటే మేలని భావిస్తారు. ఎందుకంటే తక్కువ ఈఎంఐ నెలకు పడుతుంది కాబట్టి సులభం అవుతుందని భావిస్తారు. అయితే దానివల్ల మీరు నష్టపోతున్నారన్న విషయం గ్రహించరు.

Home Loan: హోమ్ లోన్ లాభదాయకంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. టెన్యూర్, ఈఎంఐల పైనే ఫోకస్..
Home Loan
Follow us on

సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చుకునేందుకు జీవిత కాలం శ్రమపడుతుంటారు. అందుకోసం ఎక్కువ మంది ఆధారపడేది హోమ్ లోన్లపైనే. సులభమైన విధానంలో అధిక మొత్తంలో ఈ హోమ్ లోన్ వచ్చే అవకాశం ఉండటంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే చాలా మంది హోమ్ లోన్ టెన్యూర్ ఎంత పెట్టుకోవాలి అనే విషయంలో కాస్త గందరగోళానికి గురవుతారు. ఎక్కువ శాతం మంది అధిక టెన్యూర్ పెట్టుకుంటే మేలని భావిస్తారు. ఎందుకంటే తక్కువ ఈఎంఐ నెలకు పడుతుంది కాబట్టి సులభం అవుతుందని భావిస్తారు. అయితే దానివల్ల మీరు నష్టపోతున్నారన్న విషయం గ్రహించరు. టెన్యూర్ పెరిగే కొద్దీ మీరు కట్టే వడ్డీ ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకూ కొత్త ఇల్లు కొనుగోలు, నిర్మించుకోవాలనుకొనే వారికి బ్యాంకులు 30 ఏళ్ల గరిష్ట కాల పరిమితితో హోమ్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. అయితే ఈ గరిష్ట పరిమితిని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇటీవల పెంచింది. తన గృహ రుణాలపై గరిష్ట పదవీకాలాన్ని 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పొడిగించింది. ఇది మీరు నెలకు చెల్లించే ఈఎంఐ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఈ 40 ఏళ్ల టెన్యూర్ అనేది వినియోగదారులకు అంత ప్రయోజనకరం కాదని నిపుణులు చెబుతున్నారు.

బజాజ్ ఫైనాన్స్ హోమ్ లోన్లు ఇలా..

హోమ్ లోన్లు తీసుకొనే వారు అధిక టెన్యూర్ పెట్టుకొని లోన్ తీసుకుంటే నెలకు చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. ఇది లక్షకు రూ. 733 నుంచి ప్రారంభమవుతుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వద్ద సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ రేటుపై గృహ రుణం అందిస్తారు. అయితే హౌసింగ్ ఫైనాన్స్ ప్రొవైడర్ హోమ్ లోన్ దరఖాస్తు సమయంలో రుణగ్రహీత వయస్సుకు లోబడి పదవీకాల పరిమితులను సవరించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో వయస్సు కోసం అర్హత ప్రమాణం 23 నుంచి 75 సంవత్సరాలు, లోన్ మెచ్యూరిటీ సమయంలో వయస్సు కోసం గరిష్ట పరిమితి 75 సంవత్సరాలు. అంటే 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు మాత్రమే పూర్తి 40 సంవత్సరాల రుణ కాలపరిమితిని పొందగలరు. 45 ఏళ్ల వ్యక్తికి, గరిష్ట పదవీకాలం 30 సంవత్సరాలు ఉంటుంది.

40 ఏళ్ల టెన్యూర్ తో ప్రయోజనాలు..

టెన్యూర్ అధికంగా ఉంటే రుణగ్రహీతలు ఈఎంఐల రూపంలో నెలవారీ చెల్లింపులు తగ్గుతాయి. దీంతో అధిక మొత్తం లోన్ గా తీసుకోవచ్చు. ఉదాహరణకు, 8.5 శాతం వడ్డీ రేటుతో, 40 ఏళ్ల గృహ రుణం తీసుకుంటే. లక్షకు ఈఎంఐ దాదాపు 5 శాతం తక్కువగా ఉంటుంది. దీంతో పెద్ద భారం అనిపించదు.

ఇవి కూడా చదవండి

ఈ నష్టం తప్పదు..

సుదీర్ఘ హోమ్ లోన్ కాలపరిమితితో మీరు సాధారణం కంటే అధిక-వడ్డీ రుణదాతకు చెల్లించాల్సి వస్తుంది. ఇది రుణం మొత్తం వ్యయాన్ని గణనీయంగా పెంచుతుంది. ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాల పరిమితికి 8.6 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారనుకుందాం. మీ నెలవారీ ఈఎంఐ రూ. 43,708 అవుతుంది. కాలపరమితి పూర్తయ్యే నాటికి మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 54.89 లక్షలు అవుతుంది. ఇప్పుడు, మీరు అదే హోమ్ లోన్ కాలపరిమితిని 30 సంవత్సరాలకు పొడిగిస్తే, మీ నెలవారీ ఈఎంఐ రూ. 38,801కి తగ్గుతుంది. కానీ మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ. 89.68 లక్షలకు చేరుకుంటుంది. ఇప్పుడు మీరు 40 సంవత్సరాల హోమ్ లోన్ కాలపరిమితిని ఎంచుకుంటే, మీ నెలవారీ ఈఎంఐ గణనీయంగా రూ.37,036కి తగ్గుతుంది. అయితే, మొత్తం హోమ్ లోన్ కాలవ్యవధికి మీ మొత్తం వడ్డీ రూ. 1.27 కోట్లకు పెరుగుతుంది. కాబట్టి 40 ఏళ్ల గృహ రుణం కోసం వచ్చే వడ్డీ 30 ఏళ్ల రుణం కోసం వచ్చే వడ్డీ కంటే 42.5 శాతం ఎక్కువ. 20 ఏళ్ల గృహ రుణం కోసం వచ్చే వడ్డీతో పోలిస్తే ఇది 1.33 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు మీరు చెల్లించే గలిగే మొత్తానికి తగినట్లుగానే లోన్ మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఈఎంఐ కూడా తగ్గుతుంది. వడ్డీ భారం కూడా అధికమవదు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..