AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health claims: హెల్త్ బీమా క్లయిమ్‌లకు సత్వర పరిష్కారం.. వెయిటింగ్‌కు ఇక చెక్.. ప్రభుత్వ చర్యలు ఇవి..

వివిధ కంపెనీలు అందిస్తున్న వీటితో ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పాలసీదారులు వివిధ ఆస్పత్రులలో చికిత్స కోసం క్లయిమ్ చేసుకుంటారు. వాటిపై బీమా కంపెనీల నుంచి అప్రూవల్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ జాప్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ (ఎన్ హెచ్ సీఎక్స్)ను ఏర్పాటు చేసింది.

Health claims: హెల్త్ బీమా క్లయిమ్‌లకు సత్వర పరిష్కారం.. వెయిటింగ్‌కు ఇక చెక్.. ప్రభుత్వ చర్యలు ఇవి..
Health Insurance
Madhu
|

Updated on: May 31, 2024 | 5:21 PM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బీమా పాలసీలు తీసుకుంటున్నారు. వివిధ కంపెనీలు అందిస్తున్న వీటితో ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పాలసీదారులు వివిధ ఆస్పత్రులలో చికిత్స కోసం క్లయిమ్ చేసుకుంటారు. వాటిపై బీమా కంపెనీల నుంచి అప్రూవల్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ జాప్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ (ఎన్ హెచ్ సీఎక్స్)ను ఏర్పాటు చేసింది.

జాప్యం నివారణ..

బీమా కంపెనీలకు ప్రస్తుతం ప్రత్యేక పోర్టల్‌లు ఉన్నాయి. దీని కారణంగా ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి సమయం పడుతోంది. నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్ఛేంజ్ (ఎన్ హెచ్ సీఎక్స్) అనేది నేషనల్ హెల్త్ అథారిటీచే అభివృద్ధి చేయబడిన డిజిటల్ హెల్త్ క్లెయిమ్ ప్లాట్‌ఫాం. ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను వేగవంతంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో భాగంగా క్లెయిమ్ మార్పిడి అభివృద్ధి చేశారు. దీనిని రెండు మూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్ హెచ్ సీఎక్స్ ను అమలు చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ఏ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్ డీఏఐ) గతేడాది చేతులు కలిపాయి.

మొదలైన ప్రక్రియ..

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్ డీఏఐ) 2023 జూన్ లో ఒక సర్క్యులర్ జారీ చేసింది. బీమా సంస్థలు, ప్రొవైడర్‌లన్నింటినీ ఎన్ హెచ్ సీఎక్స్ లో చేరాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆదిత్య బిర్లా హెల్త్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్, బజాజ్ అలయన్జ్, హెచ్‌డీఎఫ్‌ సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్, టాటా ఏఐజీ జనరల్, పారామౌంట్ టీపీఏ, యునైటెడ్ ఇండియా తదితర ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ హెచ్ సీఎక్స్ ఇంటిగ్రేషన్‌ను పూర్తి చేశాయి.

ప్రయోజనాలు ఇవే..

  • ఎన్ హెచ్ సీఎక్స్ ద్వారా అన్ని బీమా కంపెనీలు ఒకే వేదికపైకి చేరతాయి. హెల్త్‌కేర్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎకో సిస్టమ్‌లోని వివిధ వాటాదారుల మధ్య క్లెయిమ్‌లకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఇది గేట్‌వేగా ఉపయోగపడుతుంది.
  • బీమా పరిశ్రమలో సామర్థ్యం, పారదర్శకత పెరుగుతుంది. పాలసీదారులు, రోగులకు ప్రయోజనం కలిగిస్తుంది.
  • ప్రభుత్వ సారథ్యంలోని ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఆరోగ్య బీమా రంగంతో పాటు పాలసీదారులు, వాటాదారులకు లాభం చేకూరుతుంది.
  • ఆరోగ్యం, ఖర్చు తదితర వాటి విశ్లేషణ కోసం సమగ్ర సమాచారం అందిస్తుంది. ఆసుపత్రులకు సౌలభ్యాన్ని అందించడం, రోగుల డేటాను నిర్వహించడం వల్ల వివిధ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.
  • అన్ని ఆసుపత్రులు ప్రామాణిక ఫార్మాట్‌లో డేటాను అప్‌లోడ్ చేస్తాయి కాబట్టి బీమా సంస్థలు సులభంగా క్లెయిమ్‌లను నిర్ధారిస్తాయి.
  • కస్టమర్ల అన్ని పాలసీల సమాచారం అందుబాటులో ఉంటుంది. బ్యాలెన్స్ కోసం ఆటోమేటెడ్ క్లెయిమ్ అభ్యర్థనను ఇతర బీమా సంస్థలతో కూడా పెంచవచ్చు, తద్వారా కస్టమర్ ప్రక్రియను సులభతరం చేయవచ్చు.
  • ఒకే ప్లాట్‌ఫాంపై నగదు రహిత అభ్యర్థనలను సేకరించడానికి ఆసుపత్రులను అనుమతి ఉంటుంది. తక్కువ సమయంలో కేసును ట్రాక్ చేయవచ్చు. టర్న్‌అరౌండ్ టైమ్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగి అడ్మిషన్, డిశ్చార్జ్ సమయంలో ప్రయోజనం చేకూర్చుతుంది.
  • ఎన్ హెచ్ సీఎక్స్ వేదికపైకి సుమారు 40 నుంచి 45 ఆరోగ్య బీమా కంపెనీలను తీసుకువచ్చేందుకు ఎన్ హెచ్ఏ, ఐఆర్డీఏఐ ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆసుపత్రులు, బీమా కంపెనీలతో సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..