స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా HDFC కీలక నిర్ణయం.. మళ్లీ ‘బర్నీ సే ఆజాదీ’ ఎడిషన్ ప్రారంభం
HDFC మ్యూచువల్ ఫండ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'బర్నీసే ఆజాదీ' ప్రచార కార్యక్రమం 5వ ఎడిషన్‌ను ప్రారంభించింది.. ఇది సాంప్రదాయ పొదుపులను దాటి పెట్టుబడులకు మారడం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. "సప్నే కరో ఆజాద్" ప్రచార చిత్రం SIP ద్వారా తన తల్లి నెరవేరని కలను సాకారం చేసిన యువతి స్ఫూర్తిదాయకమైన కథను తెలియజేస్తుంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో ఒకటైన HDFC మ్యూచువల్ ఫండ్ కీలక నిర్ణయం తీసుకుంది. HDFC మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి నిర్వాహక యాజమాన్యం.. HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘బర్నీ సే ఆజాదీ’ ప్రచారాన్ని 5వ ఎడిషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చొరవ మహిళలు సాంప్రదాయ పొదుపు పద్ధతులను దాటి.. పెట్టుబడి ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడానికి స్ఫూర్తినిస్తుంది.
కలలను నిజం చేసుకోండి.. “సప్నే కరో ఆజాద్” ఈ సంవత్సరం ప్రచార చిత్రం..
ఈ సంవత్సరం ప్రచార చిత్రం “సప్నే కరో ఆజాద్” (కలల్ని నిజం చేసుకోండి..) .. కుటుంబ అవసరాలను తీర్చడానికి తన తల్లి ఒక జాడిలో డబ్బు దాచుకోవడాన్ని చూసే ఒక యువతి స్ఫూర్తిదాయకమైన కథ ఈ చిత్రం. తన తల్లి కృషి – త్యాగం నుండి ప్రేరణ పొంది, ఆమె కొత్త మార్గాన్ని ఎంచుకుంటుంది.
ఆమె SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెట్టి, బోటిక్ తెరవాలనే తన తల్లి నెరవేరని కలను నెరవేరుస్తుంది. నిజమైన స్వేచ్ఛ కేవలం డబ్బు ఆదా చేయడం ద్వారా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక పెట్టుబడి ద్వారా కలలను సాకారం చేసుకోవడం ద్వారా వస్తుందని ఈ కథ నొక్కి చెబుతుంది.
సామాజిక ఉద్యమంగా మారిన ప్రచారం..
ఈ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ MD & CEO నవనీత్ మునోత్ మాట్లాడుతూ.. “గత నాలుగు సంవత్సరాలుగా, ‘బర్నీ సే ఆజాది’ ప్రచారం సంపద సృష్టిని పరిమితం చేసే సాంప్రదాయ పొదుపు అలవాట్ల నుండి విముక్తిని సూచించే సామాజిక ఉద్యమంగా పరిణామం చెందింది..’’ అంటూ పేర్కొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో ప్రారంభించిన ఈ ప్రచారంలో.. సాంప్రదాయ పొదుపు పద్ధతి అంటే జాడీ నుంచి మార్పునకు శక్తివంతమైన చిహ్నంగా మేము పునర్నిర్వచించామని, భారతదేశం అంతటా మహిళలు సమాచారంతో కూడిన, దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ప్రేరణనిచ్చామని ఆయన అన్నారు. అలాగే.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీ డబ్బు.. మీ లాగే కష్టపడి పనిచేసినప్పుడు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ సాధించబడుతుంది.. అంటూ తెలిపారు.
79 వీధి నాటకాల ద్వారా సందేశం..
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు పెట్టుబడి ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి HDFC మ్యూచువల్ ఫండ్ దేశవ్యాప్తంగా 79 ప్రదేశాలలో వీధి నాటకాలను నిర్వహిస్తుంది. ‘బర్నీ సే ఆజాది’ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తూ.. ప్రతి మహిళ నేర్చుకోవడం, ఎదగేలా చేయడం.. అలాగే.. అభివృద్ధి చెందగల పెట్టుబడి దృశ్యం గురించి అవగాహన కల్పించడానికి HDFC మ్యూచువల్ ఫండ్ అంకితం చేయబడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




