ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి లేదంటే ఇబ్బందులు తప్పవు!

జేబులో, ఇంట్లో క్యాస్ ఉంచుకోకుండా యూపీఐలపై ఎక్కువ ఆధారపడేవారికే ఈ అలెర్ట్‌. అందులోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాను ఫోన్‌ పే, గూగుల్‌ పే లేదా ఇతర యూపీఐ పేమెంట్స్‌ యాప్‌లకు లింక్‌ చేసుకున్న వారు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి లేదంటే ఇబ్బందులు తప్పవు!
Upi Qr

Updated on: Feb 20, 2025 | 1:51 PM

ఈ మధ్య కాలంలో అందరు ఫోన్‌ ఫే, గూగుల్‌ పే వంటి యూపీఐ యాప్‌లనే ఎక్కువగా వాడుతున్నారు. అయితే.. యూపీఐలపై ఎక్కువ ఆధారపడేవారికే ఈ అలెర్ట్‌. అందులోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాను ఫోన్‌ పే, గూగుల్‌ పే లేదా ఇతర యూపీఐ పేమెంట్స్‌ యాప్‌లకు లింక్‌ చేసుకున్న వారు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. అదేంటంటే.. ఈ నెల 22న అంటే శనివారం అర్థరాత్రి 2.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు హెడ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యవసర సిస్టమ్‌ మెయిటెనెన్స్‌ చేపడుతున్నట్లు బ్యాంక్‌ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Call Merging Scam: కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి? కొత్త రకం మోసం.. తస్మాత్‌ జాగ్రత్త!

ఆ నాలుగున్నర గంటల పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో లింక్‌ అయి ఉన్న యూపీఐ సేవలు నిలిపివేస్తామని వెల్లడించారు. సో.. 22వ తేదీ స్టార్ట్‌ అయిన రెండున్నర గంటల తర్వాత.. అంటే 22 తేదీ 2.30 am నుంచి 7 am వరకు మీ ఫోన్‌ పే, గూగుల్‌ పేలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు వెల్లవు, రావు. ఒక వేళ మీకు రెండు లేదా అంత కంటే ఎక్కువ బ్యాంక్‌ ఖాతాలో యూపీఐ యాప్‌లో లింక్‌ అయి ఉంటే ప్రైమరీ అకౌంట్‌గా హెచ్‌డీఎఫ్‌సీ కాకుండా వేరే బ్యాంక్‌ అకౌంట్‌ పెట్టుకోండి.

ఇది కూడా చదవండి: Credit Card: ఇన్‌యాక్టివ్ క్రెడిట్ కార్డుతో చాలా ముప్పు.. అసలు సమస్య తెలిస్తే షాక్

లేదు ఒక్కటే అకౌంట్‌ ఉంది, అది కూడా హెచ్‌డీఎఫ్‌సీనే ఉంది అంటే మాత్రం 22 తేదీ కంటే ముందే కొంత క్యాష్‌ విత్‌డ్రా చేసి చేతిలో పెట్టుకుంటే మంచింది. ఎలాగో ఆ టైమ్‌లో మనం నిద్రలోనే ఉంటాం కదా అనుకుంటే ఓకే. లేదు.. ట్రావెలింగ్‌లో ఉంటాం, లేదా వేరే ఏమైనా అత్యవసర పనులకు అసవరం ఉంటే ఇబ్బంది పడతారు. క్యాష్‌ లేకుండా ఓన్లీ యూపీఐపైనే ఆధార పడే హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు మాత్రం ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. లేదంటే హెడ్‌డీఎఫ్‌సీ వారి పేజ్యాప్‌(PayZapp) వాడుకోవచ్చు అని ఆ బ్యాంక్‌ అధికారులు అంటున్నారు.