AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Home Loan: వాట్సాప్‌లో హోం లోన్‌.. సరికొత్త స్కీంను ప్రవేశపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ..

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(HDFC) మంగళవారం గృహ రుణం( Home loan) కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది...

HDFC Home Loan: వాట్సాప్‌లో హోం లోన్‌.. సరికొత్త స్కీంను ప్రవేశపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ..
Hdfc Car Loan
Srinivas Chekkilla
|

Updated on: May 18, 2022 | 8:56 AM

Share

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(HDFC) మంగళవారం గృహ రుణం( Home loan) కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది . దీనికి ‘స్పాట్ ఆఫర్'(Spot offer) అని పేరు పెట్టింది. ఈ స్పాట్‌ ఆఫర్‌ వాట్సాప్‌(whatsapp)లో అందుబాటులో ఉంటుంది. వాట్సాప్‌లో స్పాట్ లోన్ కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలు 2 నిమిషాల్లో లోన్ ఆమోదం పొందుతారు. దీని కోసం, రుణగ్రహీతలు +91 98670 00000 నంబర్‌కు వాట్సాప్ సందేశం పంపాలి. కొంత ప్రాథమిక సమాచారాన్ని పంచుకోవాలి. మీరు పంచుకున్న సమాచారం ఆధారంగా లోన్‌ అర్హత నిర్ణయిస్తారు. WhatsAppలో స్పాట్ హోమ్ లోన్ సదుపాయం కేవలం జీతం పొందే వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఇలా చేయండి..

1.ముందుగా, +91986700000000 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని పంపండి, అది లోన్ ప్రాసెస్‌ను ప్రారంభిస్తుంది. 2.ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, మెను నుంచి కొత్త రుణాలను ఎంచుకోండి. 3.ఆపై స్పాట్ ఆఫర్ (కొత్తది) ఎంచుకోండి 4.ఎంప్లాయ్‌మెంట్ కేటగిరీలో జీతం లేదా స్వయం ఉపాధిని ఎంచుకోండి. 5 .నివాసి చిరునామాలో భారతీయ, NRI ఆప్షన్లలో ఎదో ఒకటి ఎంచుకోవాలి. 6.మీ నివాస చిరునామా పిన్‌కోడ్‌ను నమోదు చేయండి. 7.పాన్ కార్డ్ ప్రకారం మీ పూర్తి పేరును పూరించండి. 8.నిబంధన, షరతును అంగీకరించాలి. ఆ తర్వాత మీ పూర్తి సమాచారం చూపిస్తుంది. మొత్తం సమాచారం సరైనదేనా అని నిర్ధారించండి. 9.ఈ సమయంలో నమోదు చేయవలసిన OTP వస్తుంది. 10.మీ స్థూల నెలవారీ ఆదాయాన్ని పేర్కొనాలి. మీ ప్రస్తుత EMI గురించి సమాచారాన్ని కూడా పంచుకోండి. 11.ఈ మొత్తం సమాచారం ఆధారంగా, ఈ ప్రిన్సిపల్ మొత్తం లోన్ అప్రూవల్ లెటర్ PDF ఫార్మాట్‌లో మీకు షేర్ అవుతుంది. 12.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఈ లోన్‌కు సంబంధించి HDFC ద్వారా మిమ్మల్ని సంప్రదించి తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తారు.

హెచ్‌డిఎఫ్‌సి ఈ నెలలో రెండుసార్లు వడ్డీ రేటును పెంచింది హెచ్‌డిఎఫ్‌సి గృహ రుణాలపై వడ్డీ రేటును ఈ నెలలో ఇప్పటివరకు రెండుసార్లు పెంచింది. 9 మే 2022న, గృహ రుణాలపై వడ్డీ రేటును 0.30 శాతం పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. ఇప్పుడు బ్యాంకు కనీస గృహ రుణ వడ్డీ రేటు 7 శాతానికి పెరిగింది. అంతకుముందు మే 1న, HDFC RPLR (రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్లు) పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలకు ఇక్కబిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…