GST On Policies: పాలసీదారులకు జీఎస్టీ కౌన్సిల్‌ గుడ్‌న్యూస్‌.. ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీ మినహాయింపు?

|

Sep 03, 2024 | 8:13 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో వివిధ పాలసీలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే పాలసీ చెల్లింపులపై జీఎస్టీ విధింపు పాలసీదారుల సంఖ్య తగ్గడానికి కారణం అవుతుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. చాలా ఏళ్లుగా పాలసీ చెల్లింపులపై జీఎస్టీ విధించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోతరుతున్నారు. అయితే తాజాగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని తొలగించడంపై త్వరలో జరగనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

GST On Policies: పాలసీదారులకు జీఎస్టీ కౌన్సిల్‌ గుడ్‌న్యూస్‌.. ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీ మినహాయింపు?
Insurance
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో వివిధ పాలసీలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే పాలసీ చెల్లింపులపై జీఎస్టీ విధింపు పాలసీదారుల సంఖ్య తగ్గడానికి కారణం అవుతుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. చాలా ఏళ్లుగా పాలసీ చెల్లింపులపై జీఎస్టీ విధించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోతరుతున్నారు. అయితే తాజాగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీని తొలగించడంపై త్వరలో జరగనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బీమా ప్రీమియంలపై 18 శాతం ఉన్న జీఎస్‌టీని తొలగించడం లేదా జీఎస్టీ భారాన్ని తగ్గించడం వంటివి చేయాలని కోరుతున్నారు. ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సహా వివిధ రాజకీయ నాయకులు పన్నును వెనక్కి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.

సెప్టెంబరు 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణ, టీడీఆర్‌పై పన్ను వంటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మీటింగ్‌లోనే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి చెల్లించే ప్రీమియంలపై జీఎస్టీను తొలగించాలనే ప్రతిపాదన పెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అత్యంత ప్రజాదరణ పొందిన జీవిత బీమా పాలసీలుగా ఉన్నాయి. ఈ పాలసీలు ఎలాంటి మెచ్యూరిటీ ప్రయోజనం అందిచకపోయినా మరణ ప్రయోజనాన్ని మాత్రం అందిస్తాయి. కాబట్టి ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు జీఎస్టీను జోడించడం వల్ల అధిక ప్రీమియం చెల్లింపులకు కారణం కావడంతో ఎక్కువ మంది ఈ పాలసీలను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. 

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (యులిప్‌లు) లేదా ఇన్వెస్ట్‌మెంట్-లింక్డ్ ప్లాంట్లు వంటి ఇతర జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ తొలగించకపోవచ్చని, కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌పై మాత్రమే జీఎస్టీ తగ్గించే అవకాశం లేదని చెబుతున్నారు. ఆ ప్లాన్‌లు లైఫ్ ప్రొటెక్షన్ కవర్‌తో పాటు మీ పెట్టుబడులపై రాబడిని అందించడం వల్ల ఆ నిర్ణయం తీసుకోరని చెబుతున్నారు. పెట్టుబడి సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీను తొలగించడాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీను తొలగిస్తే బీమా చెల్లింపుదారులు పెరిగే అవకాశం ఉందని బీమా పరిశ్రమ భావిస్తుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం కోసం బీమా పరిశ్రమ వర్గాలు వేచి చూస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి