జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు… గతేడాది మార్చితో పోలిస్తే భారీగా పెరిగిన ఆదాయం
మార్చి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత నెలలో 1,23,902 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
GST collections 2021: మార్చి నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత నెలలో 1,23,902 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు కావడం ఇదే తొలిసారని తెలిపింది. గత ఆరు నెలలుగా రూ.లక్ష కోట్లు మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు.. తాజాగా సరికొత్త రికార్డును నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చిలో వచ్చిన ఆదాయం కంటే ఇది 27శాతం అధికమని కేంద్రం తెలిపింది.
జీఎస్‌టీ వసూళ్ళలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే సమయంలో వసూలైనదాని కన్నా 27 శాతం ఎక్కువ. గడచిన ఐదు నెలల నుంచి జీఎస్‌టీ వసూళ్ళు పుంజుకుంటున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, వస్తువుల దిగుమతులపై ఆదాయం 2020 మార్చిలో కన్నా 70 శాతం అధికంగా 2021 మార్చిలో వచ్చింది. సేవల దిగుమతి సహా దేశీయ లావాదేవీల నుంచి ఆదాయం 2020 మార్చిలో కన్నా 17 శాతం ఎక్కువగా ఈ ఏడాది మార్చిలో వసూలు అయినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
2021 మార్చిలో వసూలైన గ్రాస్ జీఎస్‌టీ రెవిన్యూ రూ.1,23,902 కోట్లు అని ఈ ప్రకటన పేర్కొంది. దీనిలో సీజీఎస్‌టీ రూ.22,973 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.29,329 కోట్లు, ఐజీఎస్‌టీ (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.31,097 కోట్లు సహా) రూ.62,842 కోట్లు, సుంకాలు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.935 కోట్లు సహా) రూ.8,757 కోట్లు అని తెలిపింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో 12 నెలలకు తొమ్మిది నెలల్లో జీఎస్‌టీ ఆదాయం రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 వల్ల ఆదాయానికి గండి పడింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో కోలుకున్న వర్తక, వాణిజ్య రంగం పుంజుకుంది. దీంతో గత ఆరు నెలల నుంచి జీఎస్‌టీ వసూళ్లు ప్రతి నెలా రూ. లక్ష కోట్ల మార్కును దాటిందని, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నదనడానికి ఇదే నిదర్శనమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also…. IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..