AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Jewellery: మీరు ఈ బంగారు అభరణాలు కొనుగోలు చేస్తున్నారా? కేంద్రం ఆంక్షలు.. ఎందుకో తెలుసా?

దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని పెండింగ్ నిర్ణయాలను అమలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రత్నాలు, విలువైన రాళ్లు పొదిగిన కొన్ని రకాల బంగారు ఆభరణాల దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చర్య ఇండోనేషియా, టాంజానియా నుండి అటువంటి విలువైన వస్తువుల దిగుమతిని తగ్గిస్తుంది. నియంత్రిత కేటగిరీ కిందకు

Gold Jewellery: మీరు ఈ బంగారు అభరణాలు కొనుగోలు చేస్తున్నారా? కేంద్రం ఆంక్షలు.. ఎందుకో తెలుసా?
Gold Jewellery
Subhash Goud
|

Updated on: Jun 12, 2024 | 1:36 PM

Share

దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని పెండింగ్ నిర్ణయాలను అమలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రత్నాలు, విలువైన రాళ్లు పొదిగిన కొన్ని రకాల బంగారు ఆభరణాల దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చర్య ఇండోనేషియా, టాంజానియా నుండి అటువంటి విలువైన వస్తువుల దిగుమతిని తగ్గిస్తుంది. నియంత్రిత కేటగిరీ కిందకు వచ్చే ఉత్పత్తులు ఇప్పుడు ప్రభుత్వం నుండి అనుమతి లేదా లైసెన్స్ పొందవలసి ఉంటుంది. ఇండోనేషియాతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది.

DGFT నోటిఫికేషన్ జారీ

ఈ మేరకు డీజీఎఫ్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారతదేశం – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం టారిఫ్ రేట్ కోటా (టిఆర్‌క్యూ)లో దిగుమతి అధికారం ఉన్నప్పటికీ, వీటిని దిగుమతి చేసుకోవడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆభరణాలపై ఎలాంటి ఆంక్షలు విధించారో తెలుసుకోండి

ముత్యాలు, కొన్ని రకాల వజ్రాలు,ఇతర విలువైన, పాక్షిక విలువైన రాళ్లతో పొదిగిన బంగారు ఆభరణాల దిగుమతి విధానాన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలని డిజిఎఫ్‌టి నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు అలాంటి బంగారు ఆభరణాల దిగుమతి ఫ్రీ నుండి రిస్ట్రిక్టెడ్ కేటగిరీకి మారింది.

కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది?

పరిమితి వర్గంలో ఉంచబడిన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి, ప్రభుత్వం నుండి లైసెన్స్/అనుమతి అవసరం. ఇండోనేషియా, టాంజానియా నుంచి ఈ ఉత్పత్తుల దిగుమతులు పెరిగాయని, అందుకే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి దేశీయ విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడకుండా సమం చేసేందుకు ప్రయత్నించిందని పరిశ్రమ నిపుణుడు ఒకరు తెలిపారు.

Gold Jewellery Import

Gold Jewellery Import

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి