Toyota Innova Crysta GX +: టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్.. భారత్‌లో నూతన వేరియంట్ విడుదల

తాజాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా ఇటీవల భారతదేశంలోని ఇన్నోవా క్రిస్టా లైనప్‌లో కొత్త వేరియంట్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ జీఎక్స్ ప్లస్ వేరియంట్‌గా పేర్కొంటున్నారు. ఈ కారు ఇన్నోవా క్రిస్టా లైనప్‌లో జీఎక్స్, వీఎక్స్ వేరియంట్ల మధ్య ఉంచిన మిడ్-లెవల్ వేరియంట్. ఈ నేపథ్యంలో ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ ప్లస్ వేరియంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Toyota Innova Crysta GX +: టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్.. భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
Toyota Innova Crysta Gx Plus
Follow us
Srinu

|

Updated on: May 08, 2024 | 7:34 AM

భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో కార్లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా ఇటీవల భారతదేశంలోని ఇన్నోవా క్రిస్టా లైనప్‌లో కొత్త వేరియంట్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ జీఎక్స్ ప్లస్ వేరియంట్‌గా పేర్కొంటున్నారు. ఈ కారు ఇన్నోవా క్రిస్టా లైనప్‌లో జీఎక్స్, వీఎక్స్ వేరియంట్ల మధ్య ఉంచిన మిడ్-లెవల్ వేరియంట్. ఈ నేపథ్యంలో ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ ప్లస్ వేరియంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

టయోటా ఇన్నోవా క్రిస్టా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ దాని ఆకర్షణను పెంచుతూ కంపెనీ ఈ ఎంఐవీకు సంబంధించిన వేరియంట్ జాబితాలో 7 సీటర్, 8 సీటర్ లేఅవుట్‌లో కొత్త జీఎక్స్ ప్లస్ వేరియంట్‌ను జోడించింది. ఇది జీఎక్స్ వేరియంట్‌తో పోల్చితే 14 అదనపు ఫీచర్లను కూడా కలిగి ఉంది. టయోటా ఇన్నోవా క్రిస్టా డివిఆర్ (డ్యాష్ క్యామ్), ఆటో-ఫోల్డ్ ఓవీఆర్ఎంలు, వెనుక కెమెరా, చెక్క ప్యానెల్స్, ప్రీమియం ఫాబ్రిక్ సీట్లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మరిన్ని వంటి లక్షణాలతో వస్తుంది. ఈ కంపెనీ ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ + వేరియంట్‌ను 5 బాహ్య రంగు ఎంపికలలో అందిస్తోంది. సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 

టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ 2005లో ఇన్నోవా బ్రాండ్ ప్రారంభించినప్పటి నుంచి ఇండస్ట్రీ బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ద్వారా సెగ్మెంట్ లీడర్గా తిరుగులేని ఖ్యాతిని పొందింది. నాణ్యత, నమ్మకానికి పర్యాయపదంగా ఇన్నోవా తరాల భారతీయుల విభిన్న చలనశీలత అవసరాలను అందించింది మరియు అదే ఆశయ విలువను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో జతచేసిన 2.4 ఎల్ డీజిల్ ఇంజిన్ ఎంపికతో మాత్రమే అందిస్తుంది. ఇప్పటికీ ఆఫర్లో ఏటీ ట్రాన్స్మిషన్ లేదు. భద్రతా ముందు భాగంలో ఇది ఎస్ఆర్ఎస్ ఎయిర్బ్యాగ్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ కంట్రోల్, వెనుక కెమెరా, ఏబీఎస్, నిరూపితమైన జీఓఏ బాడీ స్ట్రక్చర్తో వస్తుంది.  కొత్తగా ప్రవేశ పెట్టిన ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ + గ్రేడ్ ఇన్నోవా క్రిస్టాకు సంబంధించిన ప్రస్తుత లైనప్‌ను పూర్తి చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మెరుగైన ఫీచర్లు, బహుళ కార్యాచరణల ద్వారా మరింత విలువను అందించే విషయంలో కొత్తగా ప్రవేశ పెట్టిన ఫీచర్లు ఒక ముందడుగని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ న్యూ రిలీజ్ తర్వాత కస్టమర్ల విస్తృత ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్ ప్లస్ 7 సీటర్ వేరింయంట్‌ను రూ.21,39,000 ఎక్స్-షోరూమ్ ధరకు & 8 సీటర్ వేరియంట్‌ను రూ. 21,44,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..