Tax Collection Increases: ఫలించిన మోడీ సర్కార్ కృషి.. పెరిగిన పన్ను వసూళ్లు
మోడీ సర్కార్‌కు పన్ను వసూళ్లు శుభవార్తను అందించాయి. ప్రతినెల పన్ను వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17 శాతం పెరుగుదలతో ఇప్పటివరకు..
మోడీ సర్కార్‌కు పన్ను వసూళ్లు శుభవార్తను అందించాయి. ప్రతినెల పన్ను వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17 శాతం పెరుగుదలతో ఇప్పటివరకు రూ.13.73 లక్షల కోట్లకు చేరాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. స్థూల ప్రాతిపదికన ఈ సేకరణ 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు రూ. 2.95 లక్షల కోట్ల విలువైన రీఫండ్‌లు జారీ చేయబడ్డాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్‌ల కంటే 59.44 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వృద్ధి వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నును కలిగి ఉంటుంది.
ఆదాయపు పన్ను కీలక పాత్ర:
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 13.73 లక్షల కోట్లు. ఇది గతేడాది ఇదే కాలానికి నికర వసూళ్లతో పోలిస్తే 16.78 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు, మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17 శాతం పెరిగి రూ. 13.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది మొత్తం ఆర్థిక సంవత్సరంలో 83 శాతం.
ప్రత్యక్ష పన్ను రెండు విధాలు:
దేశంలో ప్రత్యక్ష పన్ను రెండు విధాలుగా వసూలు చేస్తోంది. ఒకటి కార్పొరేట్ పన్ను రూపంలో, మరొకటి వ్యక్తి ఆదాయపు పన్ను రూపంలో. అదే సమయంలో 2017-18 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరం మధ్య ఐదేళ్లలో వివిధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన సెస్, సర్‌చార్జి వసూలు 133 శాతం పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2017-18లో రూ.2,18,553 కోట్లుగా ఉన్న వసూళ్లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5,10,549 కోట్లకు పెరిగాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 271 ప్రకారం యూనియన్ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సెస్, సర్‌చార్జి విధించింది.
భారతదేశంలో విధించబడిన వివిధ రకాల సెస్‌లలో మోటారు వాహనాలపై ఇన్‌ఫ్రా సెస్, సేవా విలువపై అగ్రి వెల్ఫేర్ సెస్, స్వచ్ఛ్ భారత్ సెస్, ఎడ్యుకేషన్ సెస్, క్రూడ్ ఆయిల్‌పై సెస్ ఉన్నాయి. సెస్ పన్నుపై కూడా పన్ను ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి