EPFO News: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త.. ఉద్యోగుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపు

|

Sep 24, 2024 | 3:33 PM

భారతదేశంలో ఈపీఎఫ్ఓ అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఉద్యోగుల సొమ్మును యాజమాన్య సహకారంతో పొదుపు చేసే ఈ సంస్థ ఉద్యోగులకు అనుకోని ఆపద సమయంలో పెద్ద దిక్కుగా ఉంటుంది. అయితే అన్ని సంస్థల్లో ఉన్నట్లుగానే ఈపీఎఫ్ఓలో కూడా ఉద్యోగులు ఉంటారు. ఈ ఉద్యోగులకు తాజాగా ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025 ఆర్థిక సంవత్సారానికి సంబంధించి 145 కార్యాలయాల్లోని 15,529 మంది ఉద్యోగుల సంక్షేమం కోసం రూ. 13.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.

EPFO News: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త.. ఉద్యోగుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపు
Epfo
Follow us on

భారతదేశంలో ఈపీఎఫ్ఓ అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఉద్యోగుల సొమ్మును యాజమాన్య సహకారంతో పొదుపు చేసే ఈ సంస్థ ఉద్యోగులకు అనుకోని ఆపద సమయంలో పెద్ద దిక్కుగా ఉంటుంది. అయితే అన్ని సంస్థల్లో ఉన్నట్లుగానే ఈపీఎఫ్ఓలో కూడా ఉద్యోగులు ఉంటారు. ఈ ఉద్యోగులకు తాజాగా ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025 ఆర్థిక సంవత్సారానికి సంబంధించి 145 కార్యాలయాల్లోని 15,529 మంది ఉద్యోగుల సంక్షేమం కోసం రూ. 13.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో హాలిడే హోమ్‌ల కోసం రూ.74.37 లక్షలు కేటాయించారు. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం 2 కోట్ల రూపాయలను సెంట్రల్ పూల్ (మరణ సహాయ నిధి)గా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ బడ్జెట్‌లో స్కాలర్‌షిప్ కోసం రూ.94.25 లక్షలు కేటాయించారు. ఇతర కార్యకలాపాల నిధుల కోసం 1.88 కోట్లు కేటాయించారు. మెడికల్ చెకప్ కోసం కేటాయించిన సంక్షేమ నిధిలో 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులపై రూ. 3.97 కోట్లు, 40 ఏళ్లలోపు ఉద్యోగుల కోసం రూ. 1.27 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా సంస్థ అన్ని కార్యాలయాల్లో మెమెంటోలపై రూ.1.26 కోట్లు, సాంస్కృతిక సమావేశాలపై రూ.29 లక్షలు, క్యాంటీన్‌పై మరో రూ.61 లక్షలు కేటాయించింది. 

అలాగే ఈపీఎఫ్ఓ తాజాగా కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఓ వ్యక్తి ఉద్యోగాలను మార్చినప్పుడు, వారి పాత ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బ్యాలెన్స్ ఆటోమెటిక్‌గా కొత్త యజమానికి బదిలీ అవుతుంది. అలాగే ఈపీఎఫ్ఓ చందాదారుల విత్‌డ్రా పరిమితి కూడా సవరించింది. తమ పీఎఫ్ ఖాతా నుంచి గతంలో రూ. 50,000 విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటే ప్రస్తుతం రూ. 1 లక్షను విత్‌డ్రా చేసుకునేలా నిబంధనలను సడలించింది. ఈపీఎఫ్ఓ ఈ ఏడాది జూన్‌లో ​​19.29 లక్షల నికర సభ్యులను చేర్చుకుంది. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.86 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఈ నెల ప్రారంభంలో ఈపీఎఫ్ఓలో భాగమైన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద 78 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూర్చే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్ (సీపీపీఎస్)కి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈపీఎస్ పెన్షనర్లు జనవరి 1, 2025 నుండి భారతదేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా ఏ శాఖ నుండి అయినా పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..