DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూలై నుంచి డీఏ పెరిగే అవకాశం..
కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే డీఏను ప్రభుత్వం పెంచనుందని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ముఖ్యంగా జూలై 1 నుంచి పెంచిన డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు అందించనుంది.

ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులన్నీ వేతన జీవులపై అధిక భారాన్ని వేస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ జీతం పెంపుపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగులకు శుభవార్త చెప్పనుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే డీఏను ప్రభుత్వం పెంచనుందని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ముఖ్యంగా జూలై 1 నుంచి పెంచిన డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు అందించనుంది. 2023 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్భణం నాలుగు శాతం తగ్గినప్పటికీ ఏడో పే కమిషన్ సిఫారసుల మేరకు ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచనుంది. డీఏను చివరిసారిగా గత నెలలో నాలుగు శాతం సవరించారు. ఇది జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు శాతం పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 42 శాతానికి పెరిగింది. దీనికి ముందు డీఏ సెప్టెంబర్ 2022లో 4 శాతం పెంచారు. ఇది జూలై 2022 నుంచి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా పెంపు కూడా జూలై 2023 నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యంగా ఏడో పే కమిషన్ మూడు నుంచి నాలుగు శాతం పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందనున్నారు.
సాధారణంగా డీఏ, డీఆర్‌ను సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. జనవరి, జూలై నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తారు. అయితే ఉద్యోగుల మూలవేతనం ఆధారంగా డీఏ ఇవ్వగా, ప్రాథమిక పెన్షన్ ఆధారంగా డియర్‌నెస్ రిలీఫ్ పెన్షనర్లకు అందిస్తారు. డియర్‌నెస్ అలవెన్స్ ఓ సూత్రం ఆధారంగా ప్రభుత్వం పెంచుతుంది. అయితే ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం గురువారం తన ఉద్యోగులకు కరువు భత్యాన్ని 34 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డీఏ రేటు పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా డీఏ పెంచుతుందనే వార్తలు ఉద్యోగులు, పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి