AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: జులైలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన లక్షల మంది ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్‌)ని పెంచింది. ఇప్పుడు ఈ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం త్వరలో మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం..

7th Pay Commission: జులైలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా..!
7th Pay Commission
Subhash Goud
|

Updated on: Apr 23, 2023 | 7:25 PM

Share

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన లక్షల మంది ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్‌)ని పెంచింది. ఇప్పుడు ఈ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం త్వరలో మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జూలైలో మరోసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఇటీవల డీఏ, డీఆర్‌లను 44 శాతం పెంచింది. పెరిగిన రేట్లు జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ డీఏ, డీఆర్ పెంపుపై ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే జరిగితే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం మరోసారి పెరగనుంది. ఇది కాకుండా, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఎక్కువ డబ్బు రావడం ప్రారంభమవుతుంది.

ఏడాదికి రెండు సార్లు..

7వ వేతన సంఘం ప్రకారం డీఏ, డీఆర్‌లను ఏడాదికి రెండుసార్లు పెంచారు. మొదటిసారిగా డియర్‌నెస్ అలవెన్స్, రిలీఫ్ జనవరిలో పెంచింది. రెండవ రివిజన్ జూలైలో జరుగుతుంది. ఆల్-ఇండియా సీపీఐ డేటా అంటే AICPI ఇండెక్స్ (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. దీని గణాంకాలు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద లేబర్ బ్యూరోచే జారీ చేయబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను ద్రవ్యోల్బణం నుంచి రక్షించడానికి వారి జీతం/పెన్షన్‌కు డీఏ/డీఆర్‌ భాగం జోడించబడింది.

ఇవి కూడా చదవండి

లేబర్ బ్యూరో నుంచి ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి నెలలో ఏఐసీపీఐ ఇండెక్స్ 0.1 పాయింట్లు తగ్గి 132.7 వద్ద నిలిచింది. జనవరిలో ఈ సూచీ 132.8 పాయింట్లుగా నమోదైంది. మార్చి నెల డేటా 28 ఏప్రిల్ 2023న విడుదల చేయబడుతుంది. ఫిబ్రవరిలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా, మరోసారి డియర్‌నెస్ అలవెన్స్, రిలీఫ్ పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లను 3-3 శాతం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా, డీఏలో సవరణ కొంత కాలం పాటు ఆగిపోయింది. సుమారు ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత, కేంద్ర ప్రభుత్వం జూలై 2021లో డీఏ, డీఆర్‌లను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. దీని తరువాత, అక్టోబర్ 2021లో ఇది 28 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది. ఆ తర్వాత డీఏ, డీఆర్‌ల రేట్లు నిరంతరం పెరుగుతూ 42 శాతానికి చేరాయి. జూలైలో 3 శాతం పెంపు అంచనాలు నిజమైతే, డీఏ, డీఆర్‌ రేటు 45 శాతానికి పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..