Banking News: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఆ విషయంలో ఈ ఏడాదే కీలక నిర్ణయం?
బ్యాంకు ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదంతో జూన్ 2024లో జీతం పెంపునకు అనుగుణంగా వారానికి 5 పని దినాలు లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ ఉద్యోగుల సంఘమైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. అయితే ఇలా చేయడం ద్వారా ఖాతాదారులకు బ్యాంకింగ్ గంటల్లో గానీ, ఉద్యోగులు, అధికారుల మొత్తం పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది.

భారతదేశంలోని ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజుల పని కల్పించాలన్న చిరకాల డిమాండ్‌ను ఈ ఏడాది ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదంతో జూన్ 2024లో జీతం పెంపునకు అనుగుణంగా వారానికి 5 పని దినాలు లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ ఉద్యోగుల సంఘమైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ బ్యాంకింగ్ రంగానికి 5 రోజుల పనివారాన్ని అనుమతించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. అయితే ఇలా చేయడం ద్వారా ఖాతాదారులకు బ్యాంకింగ్ గంటల్లో గానీ, ఉద్యోగులు, అధికారుల మొత్తం పని గంటలలో గానీ ఎలాంటి తగ్గింపు ఉండదని బ్యాంకు ఉద్యోగుల సంఘం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా బ్యాంకు ఉద్యోగులపై సానుకూలమైన నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బ్యాంకు ఉద్యోగుల పని దినాల విషయంలో అనుకూలంగా సమీక్షించాలని, తదనుగుణంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)ని ఆదేశించాలని యూనియన్ ఆర్థిక మంత్రిని కోరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకు శాఖలు రెండో, నాల్గవ శనివారాలు సెలవు ఉన్న విషయం తెలిసిందే 2015 నుంచి అన్ని శని, ఆదివారాల్లో ఆఫ్‌లు ఇవ్వాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2015లో సంతకం చేసిన 10వ ద్వైపాక్షిక సెటిల్‌మెంట్ ప్రకారం ఆర్‌బీఐతో పాటు ప్రభుత్వం కూడా ఐబీఏతో ఏకీభవించాయి. అందువల్ల రెండో, నాలుగో శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాయి. జీతంపై ఐబీఏ, బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు గత సంవత్సరం భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)లో 12,449 కోట్ల రూపాయల జీతాల పెంపునకు 17 శాతం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
జీతాల పెంపును కేంద్రం ఆమోదిస్తే అన్ని పీఎస్‌బీలు, ఎంపిక చేసిన పాత తరం, ప్రైవేట్ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. డిసెంబర్ 7, 2023న జరిగిన చర్చల తర్వాత ఐబీఏ, బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్‌లు కుదుర్చుకున్న ఎంఓయూలో 180 రోజుల్లోగా వేతన సవరణను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








